టీడీపీ, జనసేన పార్టీల సమన్వయ కమిటీ సమావేశంలో మూడు అంశాలపై తీర్మానం చేసినట్టుగా ఆ పార్టీ నేతలు చెప్పారు. రాజమండ్రిలో రెండు పార్టీల సమన్వయ కమిటీ సమావేశం జరిగింది.
రాజమండ్రి:వచ్చే ఎన్నికల్లో ఏపీ రాష్ట్రంలో టీడీపీ, జనసేన సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కానుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ధీమా వ్యక్తం చేశారు.సోమవారంనాడు టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. సుమారు రెండు గంటలకు పైగా ఈ సమావేశం జరిగింది.ఈ సమావేశం ముగిసిన తర్వాత ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మీడియాకు వివరించారు.
విజయదశమి రోజున రెండు పార్టీల నేతలు సమావేశం కావడం రాష్ట్రానికి మేలు చేస్తుందన్నారు.టీడీపీ, జనసేనలు కలిసి వెళ్లాలని గతంలోనే నిర్ణయం తీసుకున్న విషయాన్ని లోకేష్ గుర్తు చేశారు.వైసీపీ పాలనలో బీసీ వర్గాలను వేధింపులకు గురి చేస్తున్నారని లోకేష్ ఆరోపించారు.బీసీలకు రావాల్సిన అనేక సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేశారని లోకేష్ చెప్పారు.ఎస్సీలకు రావాల్సిన 26 సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేశారన్నారు.వైసీపీ నేతల వేధింపులతో ముస్లిం సోదరులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని లోకేష్ చెప్పారు.
undefined
ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిని పలు రకాలుగా వేధింపులకు గురి చేశారని లోకేష్ గుర్తు చేశారు.ఎలాంటి తప్పు చేయని చంద్రబాబును జైలులో ఉంచారని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు.వ్యవస్థలను మేనేజ్ చేసి ప్రతిపక్ష నేతల గొంతు నొక్కుతున్నారని లోకేష్ ఆరోపించారు.ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు రెండు పార్టీల నేతలు సమావేశమైనట్టుగా లోకేష్ వివరించారు.సాగునీటి ప్రాజెక్టుల్లో ప్రభుత్వ చేతకానితనం కన్పిస్తుందని లోకేష్ చెప్పారు.నాలుగేళ్లలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదని లోకేష్ విమర్శించారు.ఉద్యోగాలు లేక యువత పక్క రాష్ట్రాలకు వలస వెళ్లిపోతున్నారన్నారు.
also read:త్వరలోనే టీడీపీ,జనసేన ఉమ్మడి కార్యాచరణ విడుదల: పవన్ కళ్యాణ్
ఓటరు జాబితా అక్రమాలపై క్షేత్రస్థాయిలో ఉమ్మడిగా పరిశీలన చేస్తామని లోకేష్ చెప్పారు. ఈ సమావేశంలో మూడు తీర్మానాలు చేసినట్టుగా లోకేష్ తెలిపారు.చంద్రబాబు అక్రమ అరెస్ట్ ను నిరసిస్తూ తీర్మానం చేశామన్నారు.వైసీపీ అరాచక పాలన నుండి ప్రజలను రక్షించాలని తీర్మానించినట్టుగా ఆయన చెప్పారు.రాష్ట్రాభివృద్ది కోసం కలిసి పోరాటం చేయాలని తీర్మానించినట్టుగా లోకేష్ వివరించారు. అంతేకాదు నవంబర్ 1వ తేదీన టీడీపీ, జనసేన ఉమ్మడి కార్యాచరణను ప్రకటిస్తామని లోకేష్ తెలిపారు.