మందు తయారీ, పంపిణీపై జోక్యం వద్దు: హైకోర్టులో ఆనందయ్య పిటిషన్

By narsimha lode  |  First Published May 27, 2021, 1:52 PM IST

 మందు తయారీ, పంపిణీపై జోక్యం చేసుకోకుండా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఆనందయ్య  గురువారం నాడు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై సోమవారం నాడు  విచారణ నిర్వహించనుంది హైకోర్టు.
 


అమరావతి: మందు తయారీ, పంపిణీపై జోక్యం చేసుకోకుండా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఆనందయ్య  గురువారం నాడు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై సోమవారం నాడు  విచారణ నిర్వహించనుంది హైకోర్టు.దాదాపు ఐదు రోజులుగా  ఆనందయ్య మందు పంపిణీ నిలిచిపోయింది.  మందుకోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు.  ఆనందయ్య మందు పంపిణీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని దాఖలైన రెండు పిటిషన్లపై ఇవాళ హైకోర్టు విచారణ నిర్వహించింది. మరోవైపు ఆనందయ్య కూడ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. 

also read:ఈ నెల 29న ఆనందయ్య మందుపై ల్యాబ్ నుండి రిపోర్ట్స్: హైకోర్టులో ఏపీ సర్కార్

Latest Videos

30 ఏళ్లుగా ఆయుర్వేద ప్రాక్టీషనర్ గా ఉన్నట్టుగా ఆయన ఆ పిటిషన్ లో పేర్కొన్నాడు. కరోనాపై సంప్రదాయ ఆయుర్వేద వైద్యం చేస్తున్నట్టుగా చెప్పారు. మందు తయారీ, పంపిణీలో జోక్యం చేసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని ఆయన హైకోర్టును ఆశ్రయించారు ప్రతివాదులుగా ఏపీ ప్రభుత్వం, జిల్లా కలెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి, ఆయుష్ కమిషనర్ ను చేర్చారు.  ఈ పిటిషన్ పై సోమవారం నాడు విచారణ చేపట్టనుంది హైకోర్టు.ఆనందయ్య మందు ఉపయోగించిన రోగుల నుండి సేకరించిన సమాచారాన్ని సీసీఆర్ఏఎస్ కు ఆయుర్వేద  వైద్యులు పంపారు. ఢిల్లీలోని జాతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ ఈ విషయమై ఏ రకమైన నిర్ణయం తీసుకొంటుందోననే సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

click me!