2025 ఖరీఫ్ నాటికి పోలవరం నీరిస్తాం: నిర్వాసితులతో జగన్ ముఖాముఖి

By narsimha lode  |  First Published Aug 7, 2023, 5:40 PM IST

గత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు  విషయంలో  నిర్లక్ష్యంగా వ్యవహరించిందని  ఏపీ సీఎం వైఎస్ జగన్ విమర్శలు  చేశారు.


 ఏలూరు: 2013-14 రేట్లతో  పోలవరం ప్రాజెక్టును  ఎలా  పూర్తి చేస్తామని  ఏపీ సీఎం వైఎస్ జగన్  ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టుకు సవరించిన అంచనాలకు  కేంద్రం అంగీకరించిందని ఆయన  చెప్పారు.

సోమవారంనాడు  ఏపీ సీఎం వైఎస్ జగన్  ఏలూరు జిల్లాలోని కుక్కునూరు మండలం గొమ్మగూడెం గ్రామంలో పోలవరం నిర్వాసితుల గ్రామాల్లో సీఎం జగన్ పర్యటించారు.  ఈ సందర్భంగా వరద ప్రభావిత బాధితులతో సీఎం జగన్ మాట్లాడారు.  పోలవరం ప్రాజెక్టుకు  కేంద్ర ప్రభుత్వం కడుతుందని  సీఎం జగన్ చెప్పారు. పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వమే నిర్మిస్తే  ముందు  నిర్వాసితుల గురించే ఆలోచించేవారమన్నారు. పోలవరం ప్రాజెక్టు  సవరించిన అంచనాలకు సంబంధించి  కేంద్ర కేబినెట్ అనుమతి పొందాల్సి ఉందన్నారు. ఈ నెలాఖరుకు  పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలకు  కేంద్ర కేబినెట్ అనుమతి పొందే అవకాశం ఉందని  జగన్  అభిప్రాయపడ్డారు.

Latest Videos

undefined

2025 ఖరీఫ్ నాటికి  పోలవరం ప్రాజెక్టు  పూర్తి చేసి  నీటిని విడుదల చేయాలనే  కృతనిశ్చయంతో  ముందుకు  వెళ్తున్నామని సీఎం జగన్  చెప్పారు.

వైఎస్ఆర్ హయంలో  47 వేల ఎకరాలకు పరిహరం ఇచ్చిన విషయాన్ని గుర్తు  చేశారు.  ప్యాకేజీ కింద కేంద్రం రూ. 6.8 లక్షలు ఇస్తుందన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం   అదనంగా పరిహరం అందించనుందని  సీఎం జగన్ వివరించారు.గత ప్రభుత్వం స్పిల్ వే పనులపై నిర్లక్ష్యం వహించిందన్నారు.దీంతో ప్రాజెక్టు  పనులు ఆలస్యమయ్యాయన్నారు. ఇందుకు  చంద్రబాబు సర్కార్ తప్పిదాలే  కారణమని సీఎం జగన్ విమర్శలు  చేశారు.

పోలవరం నిర్వాసితులకు  పునరావాసం, పరిహారం విషయం కేంద్రం చేతుల్లో ఉన్నందున  ఈ విషయమై  కేంద్రంపైనే ఆధారపడాల్సి వస్తుందన్నారు.  ఈ విషయాన్ని త్వరగా పరిష్కరించాలని  కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తున్నామన్నారు. 

 పోలవరం ముంపు  ప్రభావిత గ్రామాల్లో ఎలాంటి సమస్యలు రాకుండా అధికారులు  చూశారా అని సీఎం జగన్ స్థానికులను అడిగి తెలుసుకున్నారు.  వరద సహాయంలో  పేర్లు లేకపోతే  ఫిర్యాదు చేయవచ్చని సీఎం జగన్ సూచించారు.  వరద సహాయం విషయంలో  కలెక్టర్లకు  పూర్తి అధికారాలను ఇచ్చామని సీఎం జగన్ గుర్తు  చేశారు.

ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం హామీ  ఇచ్చారు.  పోలవరం ప్రాజెక్టులో  తొలి విడతలో 41.1 మీటర్ల స్థాయిలో నీటిని నింపుతామన్నారు.  మూడు దశల్లో ప్రాజెక్టులో నీటిని నిల్వ చేస్తామని సీఎం వివరించారు.  సీడబ్ల్యూసీ నిబంధనల మేరకే  ప్రాజెక్టులో నీటిని నిల్వ చేస్తామన్నారు. 

 గోదావరి  వరదలతో ఇళ్లు దెబ్బతింటే సాయం  అందుతుందన్నారు.  గత ప్రభుత్వాల కంటే  భిన్నంగా  వరద సహాయం అందించినట్టుగా సీఎం జగర్ చెప్పారు.  పోలవరం ముంపు గ్రామాల్లో లిడార్ సర్వే ద్వారా అందరికీ  న్యాయం జరుగుతుందని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. 
 
.

click me!