చంద్రబాబుకు మద్దతిస్తే ఎన్టీఆర్‌కు పట్టినగతే: పవన్ కళ్యా‌ణ్‌పై కొడాలి నాని

Published : Aug 07, 2023, 03:12 PM IST
చంద్రబాబుకు మద్దతిస్తే ఎన్టీఆర్‌కు పట్టినగతే: పవన్ కళ్యా‌ణ్‌పై  కొడాలి నాని

సారాంశం

టీడీపీ చీఫ్  చంద్రబాబునాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ లపై  మాజీ మంత్రి  కొడాలి నాని విమర్శలు చేశారు

అమరావతి: చంద్రబాబుకు మద్దతిస్తే  ఎన్టీఆర్ కు పట్టిన గతే  పవన్ కళ్యాణ్ కు పడుతుందని  మాజీ మంత్రి కొడాలి నాని  జనసేన చీఫ్  పవన్ కళ్యాణ్ కు  సూచించారు. సోమవారంనాడు  మాజీ మంత్రి కొడాలి నాని  మీడియాతో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ను తాను వ్యక్తిగతంగా కలవాలని గతంలో  ప్రయత్నిస్తే  తనకు  ఆయన అపాయింట్ మెంట్ ఇవ్వలేదన్నారు.

పవన్ కళ్యాణ్ తనకు అపాయింట్ మెంట్ ఇస్తే  చంద్రబాబు గురించి వాస్తవాలు చెప్పేవాడినన్నారు. చంద్రబాబు మద్దతుదారులతో  కలిసి పవన్ కళ్యాణ్ మాపై  దాడి చేస్తే  చూస్తూ ఊరుకోమని  మాజీ మంత్రి కొడాలి నాని  తేల్చి చెప్పారు.చంద్రబాబు రక్తంలోనే వెన్నుపోటు ఉందని ఆయన  విమర్శించారు.చంద్రబాబు స్క్రిప్ట్ ను  పవన్ అమలు చేస్తే ఎదుర్కొంటామన్నారు.దొంగలను, 420లను  పవన్ కళ్యాణ్ పక్కన పెట్టాలని మాజీ మంత్రి  కొడాలి నాని  సూచించారు.

చంద్రబాబుకు  మద్దతిచ్చిన వారి బట్టలు ఊడదీసి  రోడ్డుపై నిలబడుతామని  మాజీ మంత్రి కొడాలి నాని  విమర్శించారు.తనకు మరోసారి అధికారం అప్పగిస్తే ప్రాజెక్టులను పూర్తి చేస్తామని  చంద్రబాబు నాయుడు  ప్రకటించడాన్ని ఆయన  ప్రస్తావించారు. చంద్రబాబునాయుడు 14 ఏళ్ల పాటు  సీఎంగా ఉన్నారన్నారు. అంతేకాదు  టీడీపీ 20 ఏళ్ల పాటు అధికారం ఉన్న విషయాన్ని ఆయన గుర్తు  చేశారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో  ఈ ప్రాజెక్టులను ఎందుకు  పూర్తి చేయలేదో చెప్పాలన్నారు.   ఇప్పుడు  అధికారం ఇస్తే  ప్రాజెక్టులను పూర్తి చేస్తామని  చంద్రబాబు ప్రకటించడాన్ని ఆయన తప్పుబట్టారు.

పోలవరం ప్రాజెక్టును  చంద్రబాబునాయుడు ఏటీఎంగా మార్చుకున్నారని  సాక్షాత్తూ  ప్రధాని విమర్శించిన విషయాన్ని  కొడాలి నాని గుర్తు  చేశారు.  పోలవరం  ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు సర్కార్ తీసుకున్న నిర్ణయాలు ప్రాజెక్టు ఆలస్యానికి కారణంగా మారాయని  మాజీ మంత్రి కొడాలి నాని  విమర్శించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Success Story : అన్న క్యాంటీన్ నుండి పోలీస్ జాబ్ వరకు .. ఈమెది కదా సక్సెస్ అంటే..!
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ చిన్న‌ గ్రామం త్వరలోనే మరో సైబరాబాద్ కానుంది, అదృష్టం అంటే వీళ్లదే