2019 మే నాటికి పోలవరం పూర్తి చేస్తాం: చంద్రబాబు

By narsimha lodeFirst Published 3, Sep 2018, 6:31 PM IST
Highlights

రాష్ట్రంలో  పెండింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రయత్నాలు  చేస్తున్నట్టు  ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. వచ్చే ఏడాది మే నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఆయన తెలిపారు

అమరావతి: రాష్ట్రంలో  పెండింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రయత్నాలు  చేస్తున్నట్టు  ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. వచ్చే ఏడాది మే నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. సుమారు లక్ష మందికి పైగా  ఈ ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించినట్టు ఆయన తెలిపారు.

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు  సోమవారం నాడు  అమరావతిలో  మీడియాతో మాట్లాడారు. 

పెండింగ్ లో ఉన్న 57 ప్రాజెక్టుల్లో 10 ప్రాజెక్టును పూర్తి చేసినట్టు చంద్రబాబునాయుడు చెప్పారు. ఈ నెలలో 12 ప్రాజెక్టులను ప్రారంభించనున్నట్టు ఆయన చెప్పారు. అక్టోబర్ మాసంలో మూడు ప్రాజెక్టులను ప్రారంభిస్తామని ఆయన తెలిపారు.

వచ్చే ఏడాది మార్చి ఏప్రిల్  నాటికి మరో 11 ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పారు. భూగర్భజలాలు తగ్గినట్టు ఆయన చెప్పారు.  ఈ ఏడాదితో పాటు వరుసగా రెండేళ్లు సరైన  వర్షాలు లేవన్నారు.

రెండు కోట్ల ఎకరాలకు సాగు నీరు అందించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు ఆయన చెప్పారు. ఈ నెల 17 నుండి వారానికో ప్రాజెక్టును ప్రారంభించేలా ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు.

పోలవరం ప్రాజెక్టు పనులు వేగంగా సాగుతున్నట్టు ఆయన చెప్పారు. వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు చర్యలు  తీసుకొంటున్నట్టు ఆయన తెలిపారు.

53 వేల కోట్లు ప్రాజెక్టు అవుతోందని డీపీఆర్ కేంద్రానికి పంపినట్టు చంద్రబాబునాయుడు చెప్పారు.భూ సేకరణ కోసమే సుమారు 23 వేల కోట్లకు పైగా ఖర్చు అవుతోందని  బాబు చెప్పారు. పోలవరం ప్రాజెక్టును వచ్చే ఏడాది మే నాటికి పూర్తి చేయాలని చెప్పారు.వచ్చే నెలలో స్పిల్‌వే కు మొదటి గేటును బిగించే ప్రక్రియను  పూర్తి చేస్తామన్నారు.కేంద్రం సహకరిస్తే  ఇంకా రాష్ట్రం వేగంగా  అభివృద్ది సాధించేదని ఆయన చెప్పారు

రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపై ఎక్కువగా నిధులను ఖర్చు చేసినట్టు చంద్రబాబునాయుడు చెప్పారు. పట్టిసీమను అడ్డుకొనేందుకు చివరివరకు ప్రయత్నాలు చేసినట్టు  బాబు చెప్పారు. అన్ని అడ్డంకులను అధిగమిస్తూ  ప్రాజెక్టుల నిర్మాణాన్ని  చేపట్టినట్టు ఆయన తెలిపారు.పోలవరం ప్రాజెక్టుతో పాటు మరో 57 ప్రాజెక్టుల ద్వారా సాగు నీరు వస్తే  రాష్ట్రం మొత్తం సస్యశ్యామలం అవుతోందన్నారు. 


 

Last Updated 9, Sep 2018, 1:18 PM IST