ముహూర్తం ఫిక్స్: ఈనెల6న సైకిలెక్కనున్న కోండ్రు

Published : Sep 03, 2018, 05:41 PM ISTUpdated : Sep 09, 2018, 01:25 PM IST
ముహూర్తం ఫిక్స్: ఈనెల6న సైకిలెక్కనున్న కోండ్రు

సారాంశం

మాజీ మంత్రి కోండ్రు మురళీమోహన్‌ సైకిలెక్కేందుకు రెడీ అయ్యారు. ఈ నెల 6న సాయంత్రం 6గటలకు పార్టీ కండువా కప్పుకునేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. అమరావతిలో సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లలో కోండ్రు మురళీ మోహన్ బిజీబిజీగా గడుపుతున్నారు. 

శ్రీకాకుళం : మాజీ మంత్రి కోండ్రు మురళీమోహన్‌ సైకిక్కేందుకు రెడీ అయ్యారు. ఈ నెల 6న సాయంత్రం 6గటలకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. అమరావతిలో సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లలో కోండ్రు మురళీ మోహన్ బిజీబిజీగా గడుపుతున్నారు. ఆగస్టు 31న టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, చంద్రబాబు బావమరిది నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో కోండ్రు చేరిక వాయిదా పడింది.  

దీంతో ఈనెల 6న ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. భారీ సంఖ్యలో కార్యకర్తలతో తరలివెళ్లి టీడీపీ కండువా కప్పుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలోని రాజాం, రేగిడి, వంగర, సంతకవిటి, రాజాం పట్టణంలోని నాయకులు, కార్యకర్తలతో సమావేశమవుతున్నారు. తనతోపాటు టీడీపీ తీర్థం పుచ్చుకునే వారిని సిద్ధం చేసుకుంటున్నారు. మరోవైపు తాను టీడీపీ తీర్థం పుచ్చుకుంటున్ను నేపథ్యంలో కార్యకర్తలంతా తరలిరావాలని కోరారు. 

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే