60 రోజుల తర్వాత అధికారంలోకి వస్తాం.. అమరావతిని పూర్తి చేస్తాం - అచ్చెన్నాయుడు

By Sairam Indur  |  First Published Feb 14, 2024, 1:02 PM IST

టీడీపీ (TDP) ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) అధికార వైసీపీ (YCP)పై తీవ్ర విమర్శలు చేశారు. అమరావతి (Amaravathi)లో ఇల్లు కట్టుకున్నాని, ఇక్కడే ఉంటానని నమ్మించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan mohan reddy) మోసం చేశారని అన్నారు. మూడు రాజధానులు పేరు చెప్పి, ఏ రాష్ట్రాన్ని డెవలప్ చేయలేదని తెలిపారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతిని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. 


బినామీ ఆస్తులు కాపాడుకోవడానికే వైసీనీ నాయకులు హైదరాబాద్ రాజధాని పాట పాడుతున్నారని టీడీపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. రాబోయే 60 రోజుల్లో ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, అమరావతిని పూర్తి చేస్తామని చెప్పారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. విశాఖపట్నంలో జగన్ రెడ్డి కుటుంబం రూ.40 వేల కోట్ల విలువైన బినామీ ఆస్తుల్ని కూడగట్టుకుందని అన్నారు. అందుకే ఇప్పటి వరకు విశాఖే రాజధాని అని అన్నారని, కానీ దానికి రాష్ట్ర ప్రజలు, కోర్టులు బ్రేక్ వేశాయని చెప్పారు.

భర్తను స్టేషన్ లో బంధించి.. భార్యపై కానిస్టేబుల్ లైంగిక దాడి.. దాచేపల్లిలో ఘటన

Latest Videos

అయితే ఇప్పుడు తెలంగాణ రాజధానిలో జగన్ రెడ్డి, వై.వి.సుబ్బారెడ్డి ముఠాకు చెందిన వేల కోట్ల బినామీ ఆస్తులు ఉన్నాయని, వాటిని కాపాడుకునేందుకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అంటూ కొత్త నాటకానికి తెరలేపారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. ‘‘గతంలో అమరావతికి 30 వేల ఎకరాలుండాలన్నారు. ఇక్కడే ఇల్లు కట్టుకున్నానన్నారు. అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతానని ప్రజల్ని నమ్మించారు. అధికారంలోకి వచ్చాక అమరాతిని నాశనం చేశారు. యువతకు ఉద్యోగ, ఉపాధి దూరం చేశాడు. రైతుల త్యాగాన్ని హేళన చేశాడు. బూటు కాళ్లతో హింసించాడు. కర్నూలు న్యాయ రాజధాని అని చెప్పి కర్నూలుకు వచ్చే హైకోర్టు బెంచి రాకుండా చేశాడు.’’ అని ఆయన ఆరోపించారు. 

రైతులకు గుడ్ న్యూస్.. రుణమాఫీపై కీలక ప్రకటన.. ఒకే విడతలో..

మూడు రాజధానుల పేరిట మూడు ప్రాంతాల మధ్య వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిచ్చు పెట్టాడని అచ్చెన్నాయుడు విమర్శించారు. రాజధానులని చెప్పి మూడు ప్రాంతాల్లో బినామీ ఆస్తులు పోగేసుకున్నారని అన్నారు. ఇప్పుడు హైదరాబాద్ పేరుతో నాలుగో ముక్క తెరపైకి తీసుకొచ్చారని తెలిపారు. ఉమ్మడి ఆస్తుల్ని దారాదత్తం చేసిన రోజున ఉమ్మడి రాజధాని అనే విషయం గుర్తు లేదా ? అని ఆయన ప్రశ్నించారు. బినామీ ఆస్తుల్ని కాపాడుకోవడం కోసం ప్రాంతాల మధ్య, ప్రజల మధ్య చిచ్చు రేపడం జగన్ రెడ్డి అరాచకానికి పరాకాష్ట అని ఆరోపించారు.

200 యూనిట్ల ఫ్రీ కరెంట్ కావాలా ? ఇవి ఉంటే సరిపోతుంది..

కుట్రలు, కుతంత్రాలతో రాజధాని విధ్వంసం, రైతుల్ని మహిళల్ని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను హింసించిన జగన్ రెడ్డి అరాచకం స్థాయి రాజధాని ఫైల్స్ సినిమా చూస్తే అర్ధమవుతుందని అచ్చెన్నాయుడు అన్నారు. రాజధానుల పేరుతో డ్రామా తప్ప ఏ ప్రాంతాన్నీ అభివృద్ధి చేయని దుర్మార్గపు సీఎంగా జగన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోయాడని ఆరోపించారు. మరో 60 రోజుల తర్వాత తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వస్తుందని, అమరావతిని పూర్తి చేస్తుందని తెలిపారు. అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేసి చూపుతామని ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ను ప్రపంచంలో అగ్రస్థానంలో నిలుపుతామని ఆయన హామీ ఇచ్చారు. 

click me!