అమరావతి భూముల కొనుగోళ్లపై సీబీఐ విచారణకు అభ్యంతరం లేదు: సుప్రీంలో జగన్ సర్కార్

By narsimha lodeFirst Published Jul 13, 2021, 3:37 PM IST
Highlights

అమరావతి భూముల కొనుగోళ్లపై  సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది.ఏపీ హైకోర్టు కనీసం కౌంటర్ దాఖలు చేసేందుకు కూడ అనుమతి ఇవ్వకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించినట్టుగా ఏపీ ప్రభుత్వం తెలిపింది.

అమరావతి: అమరావతి భూముల కొనుగోళ్లపై సీబీఐతో దర్యాప్తు  చేయించినా  అభ్యంతరం లేదని  ఏపీ ప్రభుత్వం తెలిపింది. సిట్టింగ్ జడ్జి లేదా రిటైర్డ్ జడ్జి పర్యవేక్షణలో విచారణ చేయించినా సిద్దమేనని జగన్ సర్కార్ తెలిపింది. అమరావతి భూములకు సంబంధించి సీఐడీ , సిట్ దర్యాప్తుపై ఏపీ హైకోర్టు ఇచ్చిన స్టే ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై మంగళవారం నాడు సుప్రీంకోర్టు విచారణ నిర్వహించింది.

 ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తరపున రాజీవ్ థావన్ వాదనలు విన్పించారు. హైకోర్టు మధ్యంతర  ఉత్తర్వులపైనే సుప్రీంకోర్టును ఆశ్రయించినట్టుగా ఏపీ ప్రభుత్వ న్యాయవాది తెలిపారు.హైకోర్టులో పూర్తిస్థాయిలో విచారణ జరిగితే సరిపోతోందన్నారు. హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయకుండా అవకాశం ఇవ్వనందునే సుప్రీంకోర్టును ఆశ్రయించినట్టుగా ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాది చెప్పారు. ఈ పిటిషన్ పై విచారణను ఈ నెల 22వ తేదీకి వాయిదా వేసింది ఉన్నత న్యాయస్థానం.

చంద్రబాబునాయుడు సర్కార్ అమరావతి భూముల విషయంలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ కు పాల్పడిందని వైసీపీ ఆరోపించింది. జన్ సీఎంా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ కూడ  భూముల కొనుగోళ్లలో అవినీతి జరిగిందని తేల్చింది.

click me!