దసపల్లా భూముల విషయంలో సుప్రీంకోర్టు తీర్పు అమలు: విజయసాయి

By narsimha lode  |  First Published Oct 11, 2022, 12:49 PM IST

విశాఖపట్టణంలోని దసపల్లా భూముల విషయంలో  సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేశామని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చెప్పారు. 


విశాఖపట్టణం:విశాఖపట్టణంలోని దసపల్లా భూముల విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేశామని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు.మంగళవారం నాడు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విశాఖపట్టణంలో మీడియాతో మాట్లాడారు. ఉత్తరాంధ్రకు ద్రోహంచేసే కుట్రలు జరుగుతున్నాయన్నారు. 

 తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో 400 కుటుంబాలకు మేలు జరుగుతుందని విజయసాయి రెడ్డి చెప్పారు.  ప్రైవేట్ భూమిని 22 ఏ నుండి తీసేస్తే తప్పేం ఉందని ఎంపీ ప్రశ్నించారు.  విశాఖపట్టణానికి పరిపాలన రాజధాని రాకుండా కుట్రలు చేస్తున్నారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. వికేంద్రీకరణపై టీడీపీ తప్పుడు  ప్రచారం చేస్తుందని  ఆయన మండిపడ్డారు. ఉత్తరాంధ్రలో కాపులు,వెలమలు,  యాదవులు, కళింగులు ఎక్కువగా ఉన్నారన్నారు. కానీ భూములు  మాత్రం చంద్రబాబు సామాజిక వర్గం చేతిలో ఉన్నాయని విజయసాయిరెడ్డి  విమర్శించారు.

Latest Videos

undefined

also read:విశాఖకు రైల్వే జోన్ రాకుంటే రాజీనామా.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన

 కొన్ని పత్రికలు టీడీపీ కరపత్రం కంటే దిగజారిపోయాయని ఆయన ఆరోపించారు.  ఎల్లో మీడియా తనపై  తప్పుడు ప్రచారం చేస్తుందని విజయసాయిరెడ్డి విమర్శించారు. ఓ పత్రిక  అధినేత పై విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తాను మీడియా రంగంలోకి ఎంటర్ అవుతున్నట్టుగా విజయసాయి రెడ్డి ప్రకటించారు. తాను ఇంతవరకు వ్యాపారం చేయలేదన్నారు. త్వరలోనే చానెల్ ను ప్రారంభిస్తానని ఆయన చెప్పారు. తనను ఇలానే రెచ్చగొడితే  పత్రికను కూడా ప్రారంభిస్తానన్నార. అంతేకాదు రియల్ ఏస్టేలట్ లో కూడా దిగుతానని విజయసాయి రెడ్డి తెలిపారు.

విశాఖపట్టణంలోని సీతమ్మధారలో తనకు త్రీ బెడ్ రూమ్ ఫ్లాట్  మాత్రమే ఉందన్నారు.  విశాఖలో తనకు ఎక్కడా కూడ భూములు లేవన్నారు.  అంతేకాదు తాను విశాఖలో భూములు అమ్మలేదు, కొనలేదని  విజయసాయిరెడ్డి తేల్చి చెప్పారు.  విశాఖలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని చేస్తున్న  ప్రచారాన్ని ఆయన తప్పుబట్టారు. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందన్నారు. 

తన  కుమార్తె కుటుంబం 40ఏళ్లుగా  వ్యాపారంలో ఉందన్నారు. ఫార్మా , ఇన్ ఫ్రాస్ట్రక్చర్, రియల్ ఏస్టేట్ సహా అనేక రంగాల్లో ఉన్నారని ఆయన వివరించారు. తన కుమార్తె కుటుంబంపై కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. 
 

click me!