అభ్యర్థుల ఎంపికపై కోటి మంది నుండి అభిప్రాయ సేకరణ: చంద్రబాబు

By narsimha lode  |  First Published Feb 24, 2024, 2:20 PM IST

అభ్యర్థుల ఎంపిక విషయంలో అనేక రకాల పద్దతుల ద్వారా సమాచారాన్ని సేకరించినట్టుగా తెలుగుదేశం పార్టీ ప్రకటించింది.


అమరావతి:కోటి 10 లక్షల మంది నుండి అభిప్రాయాలను సేకరించిన తర్వాత అభ్యర్థుల ఎంపిక చేసినట్టుగా టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు చెప్పారు.శనివారం నాడు తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు  అమరావతిలో మీడియాతో మాట్లాడారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడ  ఇంత కసరత్తు తాను చేయలేదన్నారు. మహిళలు, బీసీలు, యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టుగా  చంద్రబాబు చెప్పారు.

also read:తొలి జాబితా: టీడీపీ సీనియర్లకు దక్కని చోటు, ఎందుకంటే?

Latest Videos

undefined

తాము ప్రకటించిన తొలి జాబితాలో  23 మంది తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగుతున్నారని చంద్రబాబు చెప్పారు.ముగ్గురు డాక్టర్లు, రిటైర్డ్ ఐఎఎస్ అధికారులు కూడ ఉన్నారని చంద్రబాబు తెలిపారు.విద్యావంతులు, పోస్టు గ్రాడ్యుయేట్స్, 51 గ్రాడ్యుయేట్స్ ఉన్నారన్నారు.వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థుల్లో  ఎక్కువ మంది  నేర చరిత్ర కలిగిన ఉన్నవారున్నారని చంద్రబాబు విమర్శించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  వైఎస్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్దిలో రాష్ట్రం తిరోగమన దిశలో సాగుతుందన్నారు.  రాష్ట్ర ప్రభుత్వ పాలనను ప్రశ్నించిన వారిపై  దమనకాండ కొనసాగుతుందన్నారు. తనపై  కేసులు పెట్టి  జైలుకు పంపించిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. మరో వైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను  విశాఖపట్టణంలో పర్యటించకుండా అడ్డుకున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

గత ఏడాది సెప్టెంబర్ మాసంలో  చంద్రబాబు నాయుడును ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏపీ సీఐడీ అరెస్ట్ చేసింది.ఈ కేసులో  రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న  చంద్రబాబును  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరామర్శించారు.  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేయనున్నట్టుగా  పవన్ కళ్యాణ్ ప్రకటించారు. 

also read:టీడీపీ-జనసేన అభ్యర్థుల జాబితా విడుదల: 94 స్థానాల్లో టీడీపీ, 5 స్థానాల్లో అభ్యర్థుల ప్రకటన

పొత్తులో బాగంగా రెండు పార్టీల మధ్య సీట్ల షేరింగ్ విషయమై  చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మధ్య  చర్చలు జరిగాయి. 50కిపైగా స్థానాల్లో పోటీ చేయాలనే  జనసేన నాయకత్వంపై ఒత్తిడి నెలకొంది. అయినా కూడ తాము  24 స్థానాల్లో పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా పవన్ కళ్యాణ్  ప్రకటించారు. 

 

click me!