మూడేళ్లలో 6.16 లక్షల మందికి ఉద్యోగాలు: ఏపీ అసెంబ్లీలో వైఎస్ జగన్

By narsimha lodeFirst Published Sep 19, 2022, 3:49 PM IST
Highlights

చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న సమయంలో కంటే తమ ప్రభుత్వ హయంలో  కొత్త ప్రభుత్వ ఉద్యోగాల కల్పనకు పెద్దపీట వేసినట్టుగా ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు. మూడేళ్ల కాలంలో కొత్తగా 2,06, 630 ప్రభుత్వ ఉద్యోగాలు సృష్టించామన్నారు.

అమరావతి:ఈ మూడేళ్ల కాలంలో రాష్ట్రంలో 2, 06, 630 కొత్త ప్రభుత్వ ఉద్యోగాలను సృష్టించామని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు. చంద్రబాబునాయుడు ప్రభుత్వం కేవలం 34,108 వేల కొత్త ప్రభుత్వ ఉద్యోగాలను సృష్టించిందని సీఎం జగన్ తెలిపారు.

సోమవారం నాడు ఏపీ అసెంబ్లీలో పారిశ్రామిక ప్రగతిపై జరిగిన చర్చలో సీఎం జగన్ పాల్గొన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి రాష్ట్రంలో 3.97 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలున్నాయన్నారు. అయితే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత  అదనంగా  2, 06, 630  ఉద్యోగాలను సృష్టించామన్నారు.  ఔట్ సోర్సింగ్ లో 3.71 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించినట్టుగా సీఎం వివరించారు.

 ఔట్ సోర్సింగ్, ప్రభుత్వ విభాగంలో కలుపుకుని 6. 16 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామన్నారు. వైద్య రంగంలోనే 16,880 ఉద్యోగాలు కల్పించిన విషయాన్ని సీఎం జగన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. స్వయం ఉపాధిలో కూడా విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చినట్టుగా సీఎం జగన్ వివరించారు. వైఎస్ఆర్ వాహన మిత్రతో  2.74 లక్షల కుటుంబాలకు లబ్ది చేకూరుతుందని సీఎం చెప్పారు.

also read:11.43 గ్రోత్‌రేట్‌తో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్: అసెంబ్లీలో ఏపీ సీఎం వైఎస్ జగన్

జగనన్న చేదోడు ద్వారా 2.98 లక్షల మందికి ప్రయోజనం కలుగుతుందన్నారు. సున్నా వడ్డీ రుణాలతో మహిళా సంఘాలకు అండగా నిలిచినట్టుగా సీఎం జగన్ తెలిపారు. రాష్ట్రంలో అన్ని రంగాల్లో అభివృద్ది జరిగినందునే  11.43  శాతం గ్రోత్ రేటుతో ఏపీ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచిందన్నారు. ఈ మేరకు అసెంబ్లీలో స్లైడ్స్ ను సీఎం జగన్  ప్రదర్శించారు. 
 

click me!