చట్ట సభల్లో తీసుకొన్న నిర్ణయాలను కోర్టులు ప్రశ్నించే వీల్లేదు: స్పీకర్ తమ్మినేని

By narsimha lodeFirst Published Aug 7, 2020, 3:51 PM IST
Highlights

పాలనా వికేంద్రీకరణ బిల్లులపై ఏపీ అసెంబ్లీలో 11 గంటల పాటు చర్చ జరిగిందని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్పారు. పార్లమెంట్, శాసనసభలలో తీసుకొన్న నిర్ణయాలను కోర్టులు ప్రశ్నించేందుకు వీలు లేదని ఆయన స్పష్టం చేశారు

అమరావతి:పాలనా వికేంద్రీకరణ బిల్లులపై ఏపీ అసెంబ్లీలో 11 గంటల పాటు చర్చ జరిగిందని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్పారు.పార్లమెంట్, శాసనసభలలో తీసుకొన్న నిర్ణయాలను కోర్టులు ప్రశ్నించేందుకు వీలు లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయాన్ని కేంద్రం కూడ తేల్చి చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

శుక్రవారం నాడు ఆయన  మీడియాతో మాట్లాడారు.ప్రతిపక్ష పార్టీకి చెందిన సభ్యులు కూడ ఈ అంశంపై 2 గంటల 17 నిమిషాల పాటు మాట్లాడారని ఆయన  చెప్పారు.వికేంద్రీకరణ బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరగలేదని  విమర్శలు చేయడం సరికాదన్నారు.సెలెక్ట్ కమిటీ ఏర్పాటు కానప్పుడు పెండింగ్ లో ఎలా ఉంటుందని  ఆయనన ప్రశ్నించారు. సెలెక్ట్ కమిటీ ఏర్పాటు కావాలంటే ఓటింగ్ జరగాలి. ఓటింగ్ జరగకుండా సెలెక్ట్ కమిటీ ఎలా ఏర్పాటు అయినట్టుగా ప్రకటిస్తారని ఆయన ప్రశ్నించారు.

"

అసెంబ్లీ వ్యవహరాల్లో కోర్టుల జోక్యం వీల్లేదని 1997లో స్పీకర్ గా ఉన్నప్పుడు యనమల రామకృష్ణుడు రూలింగ్ ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.శాసనసభ తీసుకొనే నిర్ణయాలపై కోర్టులకు వెళ్తారా అని ఆయన ప్రశ్నించారు. 

అసెంబ్లీలో టీడీపీకి ఉన్న బలం కంటే ఎక్కువ సమయాన్ని కేటాయించినట్టుగా చెప్పారు. ఈ రెండు బిల్లులను సెలెక్ట్ కమిటికి పంపాలని అసెంబ్లీలో టీడీపీ ఎందుకు అడగలేదో చెప్పాలన్నారు. శాసనమండలిలోనే ఎందుకు సెలెక్ట్ కమిటినీ కోరుకొన్నారని ఆయన ప్రశ్నించారు. రాజధానిని ఫ్రీ జోన్ గా చేస్తామని వికేంద్రీకరణ లక్ష్యంగా మూడు ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని సీఎం చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

పార్లమెంట్, శాసనసభలలో తీసుకొన్న నిర్ణయాలను కోర్టులు ప్రశ్నించేందుకు వీలు లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయాన్ని కేంద్రం కూడ తేల్చి చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

ఈ ఏడాదిలో 52 బిల్లులు పాస్ చేసినట్టుగా ఆయన తెలిపారు. చారిత్రక రిజర్వేషన్లు, సంక్షేమానికి చెందిన బిల్లులు పాస్ చేసినట్టుగా చెప్పారు.శాసన మండలికి మంత్రులు బిల్లులు ఆమోదం కోసం వెళతారన్నారు.ప్రభుత్వం నుండి ప్రతినిధులుగా వెళ్లిన మంత్రులను మండలికి రాకూడదు అని కొందరు వ్యాఖ్యానించడం ఎంతవరకు సమంజసమన్నారు.

 

click me!