వెంటాడుతున్న కేసులు: 2 గంటలకు పైగా పోలీస్ స్టేషన్‌లోనే జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి

By narsimha lodeFirst Published Aug 7, 2020, 3:22 PM IST
Highlights

రెండు గంటలుగా అనంతపురం పోలీస్ స్టేషన్ లోనే మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డిలు ఉన్నారు. అనంతపురం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లోనే ఉన్నారు.


అనంతపురం: రెండు గంటలుగా అనంతపురం పోలీస్ స్టేషన్ లోనే మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డిలు ఉన్నారు. అనంతపురం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లోనే ఉన్నారు.

అక్రమంగా వాహనాల రిజిస్ట్రేషన్ల కేసులో  గురువారం నాడు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రబాకర్ రెడ్డి, ఆయన కొడుకు అస్మిత్ రెడ్డి కడప జైలు నుండి విడుదలయ్యారు. ఈ సమయంలో కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించారని జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి, జేసీ పవన్ కుమార్ రెడ్డిలపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరితో పాటు 31 మందిపై కూడ పోలీసులు కేసు నమోదు చేశారు.

 జైలు నుండి జేసీ ప్రభాకర్ రెడ్డి విడుదలయ్యే సందర్భంగా అనంతపురం నుండి పెద్ద ఎత్తున ఆయన అభిమానులు కడపకు వచ్చారు. కోవిడ్ నిబంధనలకు విరుద్దంగా పెద్ద ఎత్తున గుమికూడారని పోలీసులు కేసులు పెట్టారు. 

also read:ఉరి తీయండి, వారికి దండం పెడితే కేసులు ఉండేవి కావు: జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలనం

కండిషన్ బెయిల్ పై విడుదలైన జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలు ఇవాళ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో సంతకం చేసేందుకు వెళ్లారు. అయితే విచారణ చేయాలనే పేరుతో పోలీసులు వారిని స్టేషన్ లోనే ఉంచారు. రెండు గంటలుగా స్టేషన్లోనే  తండ్రీ కొడుకులు ఉన్నారు.

అనారోగ్యంతో బాధపడుతున్న జేసీ ప్రభాకర్ రెడ్డి మందులు వేసుకోవాలని ఆయన తరపు న్యాయవాది పోలీసులకు చెప్పినా కూడ పట్టించుకోలేదని జేసీ వర్గీయులు ఆరోపిస్తున్నారు. 

click me!