ప్రాంతాల మధ్య అసమానతలు రూపుమాపడమే మా అభిమతం: మూడు రాజధానుల చర్చలో బుగ్గన

By narsimha lode  |  First Published Mar 24, 2022, 4:13 PM IST

ప్రాంతాల మధ్య  అసమానతలను రూపుమాపడమే తమ ప్రభుత్వం ఉద్దేశ్యమని ఏపీ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు. మూడు రాజధానులపై ఇవాళ స్వల్ప కాలిక చర్చలో మంత్రి పాల్గొన్నారు. 
 


అమరావతి: ప్రాంతాల మధ్య అసమానతలను రూపుమాపాలనేది తమ ఉద్దేశ్యమని ఏపీ రాష్ట్ర ఆర్ధిక శఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు.ఏపీ అసెంబ్లీలో గురువారం నాడు మూడు రాజధానుల అంశానికి సంబంధించి జరిగిన చర్చలో ఏపీ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి Buggana Rajendranath పాల్గొన్నారు.

ప్రాథమిక హక్కులపై Constitutionలో స్పష్టత ఉందన్నారు. మన ప్రాథమిక హక్కులను ఎవరూ కూడా లాక్కోకుండా రక్షణ ఉందని ఆయన గుర్తు చేశారు.ఒకిరి హక్కును ఇంకొకరు లాక్కోకూడదని ఆయన చెప్పారు. రాజ్యాంగం ప్రకారంగానే పాలన సాగుతుందని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు. ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు చాలా ముఖ్యమైనవన్నారు ప్రాథమిక హక్కుల ఆధారంగానే చట్టాలు రూపొందిస్తారని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వివరించారు.  మన ప్రాథమిక హక్కులను ఎవరూ లాక్కోకుండా  రక్షణ చట్టం ఉందని మంత్రి గుర్తు చేశారు. 

Latest Videos

undefined

తలసరి ఆదాయంలో కృష్ణ, విశాఖపట్టణం, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలు టాప్‌లో ఉన్నాయని మంత్రి చెప్పారు. శ్రీకాకుళం, కర్నూల్, విజయనగరం జిల్లాల్లో తలసరి ఆదాయం తక్కువగా ఉందని మంత్రి తెలిపారు. జిల్లాల్లో తలసరి ఆదాయాలు చూస్తే అసమానతలున్నాయని మంత్రి వివరించారు. అన్ని రంగాల్లో ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలు వెనుకబడి ఉన్నాయన్నారు మంత్రి. ప్రాంతాల మధ్య అసమానతల్ని తొలగించాలని రాజ్యాంగంలో ఉందని ఆర్ధిక మంత్రి చెప్పారు. ప్రతి ప్రాంతాన్ని సమానంగా చూడాలన్నదే తమ ఉద్దేశ్యమని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు.ఇలాంటి పరిస్థితుల్లో సమానత్వంపై ప్రభుత్వానికి బాధ్యత ఉందన్నారు.సమానత్వంపై దృష్టి పెట్టాలని ఎన్నో అనుభవాలు చెబుతున్నాయని ఆయన గుర్తు చేశారు.

Telangana కన్నా ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలు వెనుకబడి ఉన్నాయని శ్రీకృష్ణ కమిటీ చెప్పిన విషయాన్ని మంత్రి ప్రస్తావించారు.కర్నూల్, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో దుర్భిక్ష పరిస్థితులున్నాయన్నారు.70 వేల మంది కుప్పం నుండి వలస వెళ్లారన్నారు.

ఏపీ లో చంద్రబాబు సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ది చేసేందుకు ప్రయత్నాలు చేయలేదన్నారు.టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆయన విమర్శలు చేశారు. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత చంద్రబాబు అభివృద్ధి వికేంద్రీకరణపై దృష్టి పెట్టకుండా కేవలం ఒక ప్రాంతంలో మాత్రమే అభివృద్ధి చేయాలని భావించారని విమర్శించారు.. చంద్రబాబు కట్టాలనుకున్నది రాజధాని కాదని నగరం మాత్రమే అని చెప్పారు. చాలా రాష్ట్రాల్లో నాలుగైదు వందల ఏళ్ల నుంచి నగరాలను అభివృద్ధి చేస్తే చంద్రబాబు మాత్రం నాలుగైదేళ్లలోనే నగరం కట్టాలని చూశారన్నారు. ఇది భ్రమ కాక మరేంటని బుగ్గన ప్రశ్నించారు.
 

మూడు రాజధానుల అంశంపై ఏపీ హైకోర్టు ఈ నెల 3వ  తేదీన కీలక తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు తర్వాత  ఇవాళ ఏపీ అసెంబ్లీలో ఈ విషయమై చర్చ జరగడం ప్రారధాన్యత సంతరించుకొంది. వైసీపీకి చెందిన ఎమ్మెల్యే, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అసెంబ్లీలో చర్చ చేయాలని  ధర్మాన ప్రసాదరావు ఏపీ సీఎం జగన్ కు లేఖ రాశారు.ఈ లేఖ ఆధారంగా ఏపీ అసెంబ్లీలో ఈ విషయమై స్వల్పకాలిక చర్చ చేపట్టారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఈ విషయమై చర్చను ప్రారంభించారు. ఈ చర్చలో పలువురు సభ్యులు ప్రసంగించారు. మాజీ మంత్రి పార్ధసారథి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలు కూడా పాల్గొన్నారు. ఆ తర్వాత ఏపీ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈ చర్చలో పాల్గొన్నారు. 

click me!