ఇకపై లోపాలకు తావులేకుండా చూసుకొంటాం: బొండా ఉమ

Published : Mar 06, 2021, 05:14 PM IST
ఇకపై లోపాలకు తావులేకుండా చూసుకొంటాం: బొండా ఉమ

సారాంశం

ఇకపై లోపాలకు తావు లేకుండా చూసుకొంటామని మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు చెప్పారు. విజయవాడ మేయర్ అభ్యర్ధిగా కేశినేని శ్వేత పేరును అధిష్టానం ప్రకటించిందని ఆయన గుర్తు చేశారు.

విజయవాడ: ఇకపై లోపాలకు తావు లేకుండా చూసుకొంటామని మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు చెప్పారు. విజయవాడ మేయర్ అభ్యర్ధిగా కేశినేని శ్వేత పేరును అధిష్టానం ప్రకటించిందని ఆయన గుర్తు చేశారు.

శనివారం నాడు కేశినేని శ్వేత బొండా ఉమ నివాసానికి వెళ్లారు. ఉమ నివాసంలో బుద్దా వెంకన్న, నాగుల్ మీరాతో ఆమె చర్చించారు. ఈ చర్చలతో అసంతృప్తి వ్యక్తం చేసిన నేతలు శాంతించారు. 

also read:కేశినేని శ్వేతకు మద్దతుగా ప్రచారం చేస్తా: బుద్దా వెంకన్న

ఈ సందర్భంగా బొండా ఉమ మీడియాతో మాట్లాడారు. శ్వేత విజయాన్ని కాంక్షిస్తూ తాను ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తానని ఆయన ప్రకటించారు. అంతకుముందు టీడీపీ ఏపీ చీఫ్ అచ్చెన్నాయుడు ఫోన్‌లో మాట్లాడారు. ఈ ముగ్గురు నేతలతో అచ్చెన్నాయుడు ఫోన్ లో మాట్లాడి వారిని శాంతింపజేసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత కేశినేని శ్వేత ఉమ ఇంటికి వెళ్లారు. శ్వేత రాయబారంతో నేతలు శాంతించారు. ఆమెకు తమ మద్దతు ప్రకటించారు.  

వి.జయవాడ నగర పార్టీలో సమన్వయలోపం ఉందని దీని కారణంగానే సమస్యలు ఉత్పన్నమౌతున్నాయని ఆ పార్టీ నేత నెట్టెం రఘురామ్ చెప్పారు. పార్టీ నేతల మధ్య వ్యక్తిగత బేధాభిప్రాయాలు లేవని ఆయన చెప్పారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం