కేశినేని శ్వేతకు మద్దతుగా ప్రచారం చేస్తా: బుద్దా వెంకన్న

Published : Mar 06, 2021, 04:50 PM ISTUpdated : Mar 06, 2021, 05:02 PM IST
కేశినేని శ్వేతకు మద్దతుగా ప్రచారం చేస్తా: బుద్దా వెంకన్న

సారాంశం

టీడీపీ అభ్యర్ధి విజయమే లక్ష్యంగా పనిచేస్తానని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న చెప్పారు.కేశినేని శ్వేతతో పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని ఆయన ప్రకటించారు.

 విజయవాడ: టీడీపీ అభ్యర్ధి విజయమే లక్ష్యంగా పనిచేస్తానని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న చెప్పారు.కేశినేని శ్వేతతో పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని ఆయన ప్రకటించారు.

వి.జయవాడలోని మూడు నియోజకవర్గాల్లో కూడ తాను పర్యటిస్తానని ఆయన చెప్పారు.చంద్రబాబుకు సవాల్ చేసే విధంగా మాట్లాడాడని విజయవాడ ఎంపీ కేశినేని నానిపై  ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ, టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్ మీరాలు  తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

also read:బెజవాడ టీడీపీ పంచాయితీ: విజయవాడ నేతలకు అచ్చెన్నాయుడు ఫోన్

ఈ వ్యాఖ్యలపై కేశినేని నాని మాత్రం వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు. ఈ విషయాన్ని అధిష్టానమే చూసుకొంటుందని ఆయన చెప్పారు.ఇవాళ మధ్యాహ్నం కేశినేని శ్వేత బొండా ఉమ మహేశ్వరరావు ఇంటికి వెళ్లారు. అక్కడే ఉన్న నాగుల్ మీరా, బుద్దా వెంకన్నలతో ఆమె చర్చించారు. ఈ చర్చల తర్వా బుద్దా వెంకన్న శ్వేతతో కలిసి ప్రచారం చేస్తానని ప్రకటించారు.పార్టీ లైన్ దాటే మనుషులం తాము కాదన్నారు. తమ అభిప్రాయాలను అచ్చెన్నాయుడికి చెప్పినట్టుగా ఆయన వివరించారు. శ్వేత అభ్యర్ధిత్వాన్ని ఎవరూ కూడ వ్యతిరేకించలేదన్నారు. 

బుద్దా వెంకన్న, నాగుల్ మీరా, బొందా ఉమ మహేశ్వరరావులతో టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు శుక్రవారం నాడు ఫోన్ లో మాట్లాడారు. రేపు చంద్రబాబునాయుడు టూర్ కు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. అచ్చెన్నాయుడు మాట్లాడిన తర్వాత శ్వేత  పార్టీ సీనియర్ నేత నెట్టెం రఘురామ్ తో భేటీ అయ్యారు. రఘురామ్ తో సమావేశం ముగిసిన తర్వాత ఆమె నేరుగా బొండా ఉమ ఇంటికి చేరుకొన్నారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం