ఈ ప్రభుత్వం మీదే, రాజకీయాలకు తావొద్దు: ఉద్యోగులతో జగన్

By narsimha lode  |  First Published Feb 6, 2022, 1:29 PM IST

ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో పీఆర్సీ సాధన సమితి నేతలు  ఆదివారం నాడు భేటీ అయ్యారు. రాష్ట్రంలో చోటు చేసుకొన్న పరిస్థితులతో పాటు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు తీసుకొన్న చర్యలను జగన్ వివరించారు.



అమరావతి: ఉద్యోగుల సమస్యల్లో రాజకీయాలకు తావు లేకుండా చూడాలని ఏపీ సీఎం YS Jaganచెప్పారు.  PRC సాధన సమితి సభ్యులు ఆదివారం నాడు క్యాంప్ కార్యాలయంలో జగన్ తో భేటీ అయ్యారుఈ సందర్భంగా ఉద్యోగ సంఘాలతో జగన్ మాట్లాడారు. తమ సమస్యలను సానుకూలంగా పరిష్కరించేందుకు ప్రయత్నించినందుకు సీఎం జగన్ కు AP Employees Union ధన్యవాదాలు తెలిపారు.ఈ ప్రభుత్వం మీదేనని చెప్పారు. మీ సహకారంతో మంచి చేయగలుగుతున్నానని ఉద్యోగ సంఘాలతో జగన్ చెప్పారు. ఆర్థిక పరిస్థితుల వల్ల, Corona ప్రభావం వల్ల మీరు ఆశించినంత రీతిలో ఇవ్వలేకపోవచ్చన్నారు. కానీ ఎంతమేర మేలు చేయగలుగుతామో అన్నిరకాలుగా చేశామన్నారు.

రాజకీయాలు ఇందులోకి వస్తే వాతావరణం దెబ్బతింటుందని ఆయన అభిప్రాయపడ్డారు.రాజకీయాలకు తావు ఉండకూడదని సీఎం జగన్ ఉద్యోగ సంఘాల నేతలకు తేల్చి చెప్పారు. ఏదైనా సమస్య ఉంటే.. అనామలీస్‌ కమిటీకూడా ఉన్న విషయాన్ని సీఎం గుర్తు చేశారు.ఎప్పుడైనా మీరు మీ సమస్యలను చెప్పుకోవచ్చని సీఎం జగన్ ఉద్యోగ సంఘాలకు చెప్పారు.

Latest Videos

ఉద్యోగ సమస్యలపై మంత్రుల కమిటీ కొనసాగుతుందన్నారు ఏ సమస్య ఉన్నా ఈ కమిటీకే చెప్పుకోవచ్చన్నారు. 
ప్రభుత్వం అంటే ఉద్యోగులదని సీఎం జగన్ స్పష్టం చేశారు. సమ్మె చేయాల్సిన అవసరం లేదన్నారు మంత్రుల కమిటీ తనతో టచ్‌లోనే ఉందని సీఎం జగన్ ఉద్యోగ సంఘాలకు వివరించారు. తన ఆమోదంతోనే మంత్రుల కమిటీ ఉద్యోగ సంఘాల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిందని చెప్పారు.  

IR ఇచ్చిన 30 నెలల కాలానికి గానూ 9 నెలల ఐ.ఆర్‌ను. సర్దుబాటు నుంచి మినహాయింపు వల్ల రూ.5400 భారం పడుతోందన్నారు. HRA రూపంలో అదనంగామరో రూ.325 కోట్లు భారం పడుతోందని సీఎం జగన్ ఉద్యోగులకు చెప్పారు.

 హెచ్‌.ఆర్‌.ఏ వల్ల రూ.800 కోట్లు, అడిషనల్‌క్వాంటమ్‌పెన్షన్, సీసీఏ రూపంలో మొత్తంగా రూ.1330 కోట్లు భారం పడుతోందని సీఎం వివరించారు. ఉద్యోగుల డిమాండ్ల కారణంగా రాష్ట్ర ఖజానాపై రూ.11,500 కోట్లు రికరింగ్‌గా భారం పడుతోందని సీఎం జగన్ తెలిపారు.రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మీరు ఈ ప్రతిపాదనలకు అంగీకరించినందుకు సీఎం జగన్ ధన్యవాదాలు చెప్పారు.

 మనం ఒక్కటిగా కలిసి ముందుకు సాగుదామన్నారు. ఈ పరిస్థితులు ఈ మాదిరిగా ఉండకపోయి ఉంటే  మీరందర్నీ మరింత సంతోషపెట్టేవాడినని జగన్ ఉద్యోగ సంఘాలకు చెప్పారు.దురదృష్టవశాత్తూ అలాంటి పరిస్థితులు లేవన్నారు. 
రాష్ట్ర ఆదాయాలు బాగా పడిపోయాయన్నారు. మినిమం టైం స్కేలు వర్తింపుతో పాటు జీతాలు పెంచామన్నారు. 

మీరు లేకపోతే నేను లేనని ఉద్యోగ సంఘాల నేతలతో జగన్ చెప్పారు. పారదర్శకంగా, అవినీతి లేకుండా బటన్‌ నొక్కి ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వగలుగుతున్నానంటే  ఉద్యోగుల వల్లే సాధ్యమన్నారు. భావోద్వేగాలకు పెద్దగా తావు ఇవ్వవద్దని ఆయన కోరారు. రాబోయే రోజుల్లో సీపీఎస్‌మీద గట్టిగా పనిచేస్తున్నామన్నారు. అన్ని వివరాలూ తీసుకుని గట్టిగా పనిచేస్తున్నామని జగన్ హామీ ఇచ్చారు. వివరాలు ఖరారైన తర్వాత ఉద్యోగ సంఘాల నాయకులతో వాటిని పంచుకుంటానని ఆయన తెలిపారు. 

ఇవాళ మీరు కొత్తపద్దతిలో తీసుకుంటున్న పెన్షన్‌ మంచిగా పెరిగేలా చూస్తాననని హామీ ఇచ్చారు. కాంట్రాక్టు ఉద్యోగుల పట్ల సానుకూలంగా ఉన్నామన్నారు. అన్ని విషయాలు కూడా మీకు తెలియజేస్తానని జగన్ ప్రకటించారు 30వేల మంది Teacherకు ప్రమోషన్లు ఇస్తున్నామని తెలిపారు. సబ్జెక్టుల వారీగా టీచర్లను తీసుకువస్తున్నామని చెప్పారు. అందరూ కలిసికట్టుగా భావితరాలకు మంచి రాష్ట్రాన్ని అందిద్దామన్నారు. 

ఎక్కడైనా కూడా తక్కువ చేస్తున్నాం అనిపించినప్పుడు.. అలా ఉండకూడదని కొన్ని చర్యలు తీసుకున్నామని జగన్ వివరించారు. దీంట్లో భాగంగానే రిటైర్‌మెంట్‌వయస్సును 60 నుంచి 62 ఏళ్లకు పెంచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 
24 నెలల జీతం రూపేణా మరోచోట మంచి జరుగుతుందనే ఉద్దేశంతో మీరు అడగకపోయినా తాము చేశామన్నారు. అలాగే ఇళ్లస్థలాల విషయంలోకూడా మీరు అడగకపోయినా నిర్ణయం తీసుకున్నామన్నారు.ప్రభుత్వం ఎప్పుడూ మీతో ఉంటుందని చెప్పారు.ఏ సమస్యపైనైనా చర్చకు సిద్ధమని తెలిపారు. 
 

click me!