చర్చలు సఫలం: సీఎం జగన్ తో భేటీ కానున్న ఉద్యోగ సంఘాల నేతలు

Published : Feb 06, 2022, 12:36 PM ISTUpdated : Feb 06, 2022, 01:00 PM IST
చర్చలు సఫలం: సీఎం జగన్ తో భేటీ కానున్న ఉద్యోగ సంఘాల నేతలు

సారాంశం

ఏపీ సీఎం వైఎస్ జగన్ తో ఉద్యోగ సంఘాల నేతలు ఆదివారం నాడు భేటీ కానున్నారు.

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు సఫలం కావడంతో ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ తో ఉద్యోగ సంఘాల నేతలు ఆదివారం నాడు భేటీ కానున్నారు. ఈ నెల 7వ తేదీ నుండి సమ్మె కూడా విరమిస్తున్నట్టుగా ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. అయితే Teachers సంఘాలు మాత్రం ఈ చర్చల పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. ప్రధాన ఉపాధ్యాయ సంఘాలు ఈ చర్చలపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ప్రకటనను విడుదల చేశాయి. 

ప్రభుత్వంతో చర్చలు విజయవంతం కావడంతో ఏపీ సీఎం YS Jagan తో ఇవాళ ఉద్యోగ సంఘాలు భేటీ  అయి ధన్యవాదాలు తెలపనున్నారు. రెండు రోజుల పాటు ఉద్యోగ సంఘాలతో నిర్వహించిన చర్చల్లో ప్రభుత్వ నుండి సానుకూలంగా స్పందించడంతో ఉద్యోగ సంఘాలు సమ్మె ను విరమిస్తున్నామని ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో ఉద్యోగ సంఘాల నేతలు జనవరి 7వ తేదీన భేటీ అయ్యారు. ఈ సమావేశంలో 23.29 శాతం పీఆర్సీ ఫిట్‌మెంట్ ఇస్తామని సీఎం   YS Jagan హామీ ఇచ్చారు. అంతేకాకుండా పెండింగ్ లోని ఐదు D.A లను ఒకే సారి ఇస్తామని హమీ ఇచ్చారు. ఫిట్‌మెంట్ కనీసం 27 శాతానికి తగ్గకుండా ఉండాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. అయితే పెండింగ్ డిఏలు ఒకేసారి ఇస్తామని హమీ ఇవ్వడంతో ఉద్యోగ సంఘాలు సానుకూలంగా స్పందించాయి.

ఈ భేటీ తర్వాత Hraవిషయమై Chief Secretary నేతృత్వంలోని కమిటీతో ఉద్యోగ సంఘాలు సంక్రాంతి పర్వదినం కంటే ముందే పలు దఫాలు భేటీ అయ్యారు. కానీ ఈ సమావేశాల్లో ఉద్యోగ సంఘాల డిమాండ్ పై ప్రభుత్వం నుండి స్పష్టత రాలేదు.  అయితే జనవరి 17వ తేదీ రాత్రి పీఆర్సీపై  ప్రభుత్వం జీవోలు జారీ చేసింది. ఈ జీవోల్లో హెచ్ఆర్‌ఏను భారీగా తగ్గించడంపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి.

30 శాతంగా ఉన్న హెచ్ఆర్ఏ స్థానంలో 16 శాతం హెచ్ఆర్ఏ ఇవ్వడంతో తాము 14 శాతం నష్టపోతున్నామని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోలను వెనక్కి తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ డిమాండ్ పై ప్రభుత్వం నుండి సానుకూలంగా స్పందించలేదు. దీంతో సమ్మెకు వెళ్లాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయం తీసుకొన్నాయి.  జనవరి 24న రాష్ట్ర ప్రభుత్వానికి సమ్మె  నోటీసును అందించాయి. శుక్రవారం నాడు ఏపీ సీఎం వైఎస్ జగన్ ఉద్యోగుల డిమాండ్లపై చర్చించారు. ఈ చర్చల తర్వాత ప్రభుత్వం సంప్రదింపుల కమిటీతో ఉద్యోగ సంఘాలు చర్చించాయి. శనివారం నాడు కూడా చర్చలు కొనసాగాయి. దీంతో ఇరువర్గాలు కూడా పరస్పర అంగీకారానికి వచ్చాయి. దీంతో ఆందోళనను విరమించుకోవాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయం తీసుకొన్నాయి.  ఈ విషయమై సీఎం జగన్ కు ఉద్యోగ సంఘాలు ధన్యవాదాలు తెలపనున్నారు.


 


 

PREV
click me!

Recommended Stories

క్షమాపణలు చెప్పిన టీడీపీ ఆర్టిస్ట్ సునీల్! | YS Bharati Video Controversy | TDP Sunil Apology
ఆ నీచానికి ఒడిగట్టింది మీరే | Perni Nani Fires On Chandrababu | Asianet Telugu