ఏపీ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం కారణంగా ఎవరికైనా ఇబ్బందులుంటే సినిమాలను వాయిదా వేసుకోవచ్చని ఏపీ రాష్ట్ర మంత్రి పేర్ని నాని చెప్పారు. సోమవారం నాడు ఏపీ మంత్రి నాని మీడియాతో మాట్లాడారు.
అమరావతి: కరోనా కేసుల వ్యాప్తిని నిరోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం కారణంగా ఇబ్బందులుంటే సినిమాలను వాయిదా వేసుకోవచ్చని ఏపీ రాష్ట్ర మంత్రి పేర్ని నాని సినీ పరిశ్రమకు సూచించారు.
Cinema Tickets ధరల తగ్గింపు అంశంపై ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఏపీ రాష్ట్ర మంత్రి పేర్ని నానికి ప్రశ్నలు సంధించారు. రామ్‌గోపాల్ వర్మ లేవనెత్తిన ప్రశ్నలకు ఏపీ మంత్రి నాని ట్విట్టర్ వేదికగా సమాధానమిచ్చారు. ఈ విషయాలపై చర్చించేందుకు మంత్రి Perni Nani దర్శకుడు Ramgopal Varma కు అపాయింట్ మెంట్ ఇచ్చారు. సోమవారం నాడు దర్శకుడు రామ్‌గోపాల్ వర్మతో సమావేశం ముగిసిన తర్వాత ఏపీ రాష్ట్ర మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు.
Corona కేసుల వ్యాప్తిని నిరోధించేందుకు తమ ప్రభుత్వం రాత్రి పూట కర్ఫ్యూను అమలు చేస్తున్నట్టుగా మంత్రి నాని చెప్పారు.అంతేకాదు సినిమా థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ నిర్ణయాన్ని తీసుకొన్నామని చెప్పారు. Sankranti కి విడుదలయ్యే సినిమాలకు ప్రభుత్వ నిర్ణయం ఇబ్బందికరంగా ఉంటే వాయిదా వేసుకోవచ్చని మంత్రి సూచించారు. కరోనా కారణంగా ఇప్పటికే ఆర్ఆర్ఆర్, రాథేశ్వామ్ సినిమాలు వాయిదా పడ్డాయన్నారు.టికెట్ ధరల తగ్గింపు విషయమై రామ్‌గోపాల్ వర్మ తరహలో ఎవరైనా వచ్చి తమతో మాట్లాడ వచ్చని మంత్రి చెప్పారు.
వ్యక్తుల అభిప్రాయాలను సంతృప్తి పర్చడం కష్టమన్నారు. సహజంగా తాము లాజిక్ లు చెబితే ఎదుటివారికి కష్టం కలుగుతుందన్నారు. సినిమాటోగ్రఫీ నిబంధనలమేరకే సినిమా టికెట్ ధరల తగ్గింపును నిర్ణయించామని మంత్రి నాని చెప్పారు.2013 లో జారీ చేసిన జీవో నెంబర్ 100 తో పోలిస్తే ధరలు పెంచే ఇచ్చామన్నారు. సినిమా టికెట్ ధరల తగ్గింపు సహేతుకంగా లేదని అనిపిస్తే నేరుగా వచ్చి కమిటీకి చెప్పొచ్చన్నారు.
సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఎవరి సలహాలను తీసుకోవడానికైనా తాము సిద్దంగా ఉన్నామని మంత్రి పేర్ని నాని చెప్పారు. హోం సెక్రటరీ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీతో చర్చించవచ్చని మంత్రి సూచించారు.
రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరల తగ్గింపు విషయమై సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే సామాన్యుడిపై భారం తగ్గించే ఉద్దేశ్యంతోనే తమ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలను తగ్గించాలని నిర్ణయం తీసుకొందని ఏపీ ప్రభుత్వం తెలిపింది.
అంతకుముందు ఏపీ మంత్రి పేర్ని నానితో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ భేటీ అయ్యారు. ఈ భేటీలలో సినీ పరిశ్రమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వానికి తాను లేవనెత్తిన ప్రశ్నలకు సంబంధించి తాను విపులీకరించేందుకు మంత్రి నానితో భేటీ అయ్యాయన్నారు. తన నుండి ప్రభుత్వం అభిప్రాయాలను విందని దర్శకుడు వర్మ చెప్పారు. ఒక్క సమావేశంతోనే ఈ సమస్యకు పరిష్కారం వస్తోందని తాను భావించడం లేదన్నారు. సినీ పరిశ్రమలో తానొక్కడినే లేనన్నారు. ప్రభుత్వం అన్ని రకాల కోణాల్లో తాను వివరించిన అంశాలపై చర్చించే అవకాశం ఉందని వర్మ అభిప్రాయపడ్డారు.సినిమా టికెట్ల ధరల తగ్గింపు అంశానికి సంబంధించి తాను ముగింపు ఇవ్వలేనని చెప్పారు. ఈ అంశానికి ముగింపు చెప్పాల్సింది ప్రభుత్వమేనని వర్మ తెలిపారు.