
విజయవాడ: నిన్న సాయంత్రం ఇంటి నుండి బయటకు వెళ్లిన రాహుల్ ఎంతకు తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు తమకు ఫిర్యాదు చేశారని ఇంచార్జీ సీపీ పాల్ రాజు చెప్పారు.
also read:విజయవాడలో కలకలం: పార్క్ చేసిన కారులో డెడ్‌బాడీ, మృతుడు ఎవరంటే?
వ్యాపార పనుల నిమిత్తం అరగంట లేదా గంట సమయంలో తిరిగి వస్తానని చెప్పి ఎంతకీ రాకపోవడంతో కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. ఇవాళ ఉదయం మాచవరం సమీపంలో కారులో డెడ్ బాడీ కన్పించింది.
అత్యాధునికమైన కారు కావడంతో నిన్న సాయంత్రం ఇంటి నుండి బయలుదేరిన రాహలు్ ఎక్కడెక్కడికి వెళ్లారనే విషయమై కూడా పోలీసులు టెక్నికల్ ఆధారాల కోసం అన్వేషిస్తున్నారు.కారు అద్దాలు పగులగొట్టడం కంటే కారు షోరూం నుండి నిపుణులను తీసుకొచ్చి కారు డోర్స్ ఓపెన్ చేయాలని పోలీసులు భావిస్తున్నారు.