పోలవరం ప్రాజెక్టును వివాదంలోకి లాగుతున్నారు: బాబు, కౌంటరిచ్చిన మంత్రి అనిల్

By narsimha lodeFirst Published Dec 2, 2020, 2:03 PM IST
Highlights

పోలవరం ప్రాజెక్టును వైసీపీ సర్కార్ అనవసరంగా వివాదంలోకి లాగుతున్నారని  టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ఆరోపించారు.

అమరావతి:  పోలవరం ప్రాజెక్టును వైసీపీ సర్కార్ అనవసరంగా వివాదంలోకి లాగుతున్నారని  టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ఆరోపించారు.ఏపీ అసెంబ్లీలో పోలవరం పై జరిగిన చర్చలో  చంద్రబాబునాయుడు మాట్లాడారు.ఈ చర్చను మంత్రి అనిల్ కుమార్ ప్రసంగించారు.

వైసీపీ సర్కార్ తీరు వల్లే పోలవరంపై అనుమానాలు నెలకొన్నాయన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి టెండర్లు తమ ప్రభుత్వం పిలవలేదన్నారు. 2013లోనే  టెండర్లను పిలిచారని ఆయన గుర్తు చేశారు.

also read:అయ్యప్ప మాల వేసుకొన్నా, గత మంత్రి కంటే ఎక్కువే నేర్చుకొన్నా: అసెంబ్లీలో మంత్రి అనిల్

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పనులు ప్రారంభమయ్యాయని చంద్రబాబు గుర్తు చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఏపీలోకి తీసుకురాకపోతే పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేది కాదన్నారు.

కేంద్ర ప్రభుత్వం 16 ప్రాజెక్టులు నిర్మించాల్సి ఉంది.. ఈ ప్రాజెక్టుల నిర్మాణం నత్తనడకన సాగుతున్నాయి.. దీంతో ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని తాము చేపడుతామని ఒప్పుకొన్నామని చంద్రబాబు వివరించారు.

కేంద్ర ప్రభుత్వంతో సన్నిహితంగా ఉంటూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం నిధులు తీసుకువచ్చారన్నారు.భూసేకరణను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని కేంద్ర మంత్రి గడ్కరీ చెప్పారని బాబు గుర్తు చేశారు. అయితే భూసేకరణను కేంద్రమే భరించాలని చట్టంలో ఉందని తాము గుర్తు చేశామన్నారు. 

పోలవరం ప్రాజెక్టు విషయంలో తాము ఏనాడూ కూడ రాజీ పడలేదని చంద్రబాబు చెప్పారు.చంద్రబాబు ప్రసంగానికి ఏపీ మంత్రి అనిల్ కుమార్ కౌంటరిచ్చారు. 2014 అంచనాలకు 2017లోనే చంద్రబాబునాయుడు ఎందుకు ఒప్పుకొన్నారో చెప్పాలని మంత్రి అనిల్ ప్రశ్నించారు.2010-11లో జరిగిన భూసేకరణకు ఎలా ఒప్పుకొన్నారని మంత్రి అడిగారు.


 

click me!