ఉండవల్లి సంచలనం: వచ్చే ఎన్నికల్లో జనసేనే కీలకం

First Published Jan 18, 2018, 10:42 AM IST
Highlights
  • వచ్చే ఎన్నికలకు సంబంధించి మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు.

వచ్చే ఎన్నికలకు సంబంధించి మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేనే కీలక పాత్ర పోషిస్తుందన్నారు. అంటే టిడిపి-వైసిపి గెలుపోటములను శాసించేది పవన్ కల్యాణే అన్నది ఉండవల్లి అభిప్రాయంగా ఉంది. ఓ మీడియాతో ఉండవల్లి మాట్లాడుతూ, రాబోయే ఎన్నికల్లో జనసేన రాష్ట్రంలో ఓ పోర్స్‌గా తయారయ్యే అవకాశం ఉందని రాజమండ్రి అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో తనకు అనుమానం లేదన్నారు. అయితే పార్టీని నిలబెట్టుకోవడం పవన్ చేతుల్లో ఉంటుందన్నారు. పవన్ కళ్యాణ్ ఏ మేరకు విజయం సాధిస్తారో చూడాలన్నారు.  

రానున్న రోజుల్లో జనసేన బలోపేతమయ్యే అవకాశం ఉందన్నారు. ఇక సినీ విమర్శకుడు కత్తి మహేష్-పవన్ వివాదంపై కూడా ఉండవల్లి ప్రస్తావించారు.  కత్తి మహేష్‌ చేస్తున్న ఆరోపణల విషయంలో పవన్ స్పందంచకుంటేనే ప్రయోజనం ఉంటుందని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో ఉన్న వారు చాలా సంయమనంతో వ్యవహరించాల్సిన అవసరం ఉంటుందన్నారు.  

పవన్ కళ్యాణ్ విషయంలో తొలుత కత్తి మహేష్ విమర్శలు చేసిన సమయంలో కొంత అర్ధవంతంగా ఉన్నప్పటికీ తర్వాత కాలంలో రొటీన్‌గా మారిందని చెప్పారు. అయితే కత్తి మహేష్ తన వాదనను అద్భుతంగా సమర్థించుకొంటారని చెప్పారు. పవన్ కళ్యాణ్‌పై విమర్శలు చేయడంలో కత్తి మహేష్ కొంత స్కోర్ చేసినట్టు కన్పిస్తోందన్నారు. ఈ తరహ విమర్శల విషయంలో మౌనంగా ఉండడమే పవన్ కళ్యాణ్‌కు ఉత్తమమని ఉండవల్లి అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు.

రాజకీయాల్లో ఉన్న నేతలంతా సంయమనం పాటించాల్సిందేనని ఉండవల్లి  సూచించారు. రాజకీయాల్లోకి వచ్చిన వారిని ఇరిటేట్ చేసేందుకు ప్రయత్నించేవారు ఉంటారని గుర్తు చేశారు. అయితే అన్నింటిని జాగ్రత్తగా గమనిస్తూ అవసరమైన వాటికే స్పందించాల్సిన అవసరం ఉందని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. కత్తిమహేష్ విమర్శలపై పవన్ అభిమానులు మాట్లాడుతున్నారని. పవన్ మాట్లాడని విషయాన్ని ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రస్తావించారు. సంయమనం పాటించడం వల్లే ప్రయోజనం ఉంటుందన్నారు.

ఏ పార్టీ అయిని తటస్థ ఓటర్లను ఆకట్టుకున్నపుడే రాజకీయాల్లో సక్సెస్ అవుతారని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. ప్రధాన పార్టీలకు చెందిన మద్దతుదారులు, సానుభూతి పరులను వదిలేసి తటస్థ ఓటర్లను ఆకట్టుకొంటేనే రాజకీయాల్లో సక్సెస్ అవుతారని ఉండవల్లి అభిప్రాయపడ్డారు.

click me!