విశాఖలో సీఎం క్యాంప్ కార్యాలయం: రూ. 113 కోట్లతో ఉడా ప్రతిపాదనలు

By narsimha lodeFirst Published Jan 31, 2021, 4:23 PM IST
Highlights

విశాఖపట్టణంలో సీఎం క్యాంప్ కార్యాలయానికి అధికారులు ప్రతిపాదనలు సిద్దం చేశారు. లేఔట్  ప్లాన్ కు కూడ ఆమోదం తెలిపినట్టుగా సమాచారం.

విశాఖపట్టణం: విశాఖపట్టణంలో సీఎం క్యాంప్ కార్యాలయానికి అధికారులు ప్రతిపాదనలు సిద్దం చేశారు. లేఔట్  ప్లాన్ కు కూడ ఆమోదం తెలిపినట్టుగా సమాచారం.సీఎం క్యాంప్ కార్యాలయం బ్లూ ప్రింట్, డిజైన్లను అధికారులు సిద్దం చేశారు. రూ. 113 కోట్లతో సీఎం క్యాంప్ కార్యాలయానికి ఉడా ప్రతిపాదనలను పంపింది.

ఈ పనుల ప్రారంభానికి తక్షణంగా రూ. 16 కోట్లు కావాలని అధికారులు ప్రభుత్వాన్ని కోరారని తెలుస్తోంది. అయితే న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా నిధులను విడుదల చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.

అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని రైతులు దాఖలు చేసిన పిటిషన్లపై  ఏపీ హైకోర్టులో విచారణ సాగుతోంది.ఈ తరుణంలో న్యాయపరమైన  ఇబ్బందులు రాకుండా  ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.ఉగాది నాటికి ఈ క్యాంప్ కార్యాలయ నిర్మాణం పూర్తి చేయాలని అధికారులు ప్లాన్ చేసుకొంటున్నారు. 

జగన్ సర్కార్ రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాట్లు చేయాలని ప్రయత్నిస్తోంది.ఈ క్రమంలోనే విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ ఏర్పాటుకు జగన్ సర్కార్ సన్నాహలు చేస్తోంది. మూడు రాజధానుల ప్రతిపాదనలను విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. 
 

click me!