వైసీపీ అభ్యర్ధిని అడ్డుకున్న టీడీపీ వర్గీయులు.. అచ్చెన్న ఇలాఖాలో ఉద్రిక్తత

By Siva KodatiFirst Published Jan 31, 2021, 4:23 PM IST
Highlights

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు, టెక్కలి ఎమ్మెల్యే కింజారపు అచ్చెన్నాయుడు స్వగ్రామం నిమ్మాడలో  ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ అభ్యర్థి అప్పన్న నామినేషన్‌ వేయకుండా టీడీపీ నేతలు అడ్డుకోవడంతో వివాదం చెలరేగింది.

నిమ్మాడ నుంచి వైఎస్‌ఆర్‌సీపీ తరఫున కింజారపు అప్పన్న సర్పంచ్‌ అభ్యర్ధిగా బరిలో దిగాడు. అప్పన్న.. అచ్చెన్నాయుడు అన్న కుమారుడు. అప్పన్న నామినేషన్‌ వేయొద్దని అచ్చెన్నాయుడు ఫోన్‌ చేసి బెదిరించినట్లు వైసీపీ ఆరోపిస్తోంది. 

Also Read:టీడీపీ అభ్యర్ధి కిడ్నాప్: ఫోన్‌లో మాట్లాడిన చంద్రబాబు

నిమ్మాడలో ఇప్పటి వరకు తనను పట్టించుకోలేదని అప్పన్న ఆవేదన వ్యక్తం చేశాడు.  సర్పంచ్‌ పదవేమన్నా రాష్ట్రపతి పదవా అంటూ అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశాడని అప్పన్న సన్నిహితులు అంటున్నారు.

ఐతే  వైసీపీ అభ్యర్థి కింజారపు అప్పన్నతో దువ్వాడ శ్రీనివాస్‌ రావడంతో టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. దువ్వాడతో సహా నామినేషన్‌ వేసే అభ్యర్థిని నామినేషన్‌ కేంద్రంలోకి రాకుండా టీడీపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, టీడీపీ వర్గీయుల మధ్య తోపులాట జరిగింది. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో గ్రామంలో భారీగా మోహరించారు. 

click me!