చిత్తూరు: టీడీపీ ఎమ్మెల్సీ కారుపై కర్రలు, రాళ్లతో దాడి

By Siva KodatiFirst Published Jan 31, 2021, 3:52 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల వేళ అక్కడక్కడ చెదురుమదురు సంఘటనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల వేళ అక్కడక్కడ చెదురుమదురు సంఘటనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి.

ఇప్పటికే పలువురు టీడీపీ అభ్యర్థులు కిడ్నాప్‌కు గురయ్యారు. తాజాగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ రాజసింహులు (దొరబాబు) వాహనంపై ఆదివారం గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు.

Also Read:పంచాయితీ ఎన్నికల్లో వైసీపీ వాళ్లు గెలిస్తే.. : చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

చిత్తూరు జిల్లాలోని యాదమర్రి ఎంపీడీవో కార్యాలయం సమీపంలో ఈ ఘటన జరిగింది. పంచాయతీ ఎన్నికల దృష్ట్యా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పరిశీలించడానికి ఎమ్మెల్సీ.. ఈరోజు ఎంపీడీవో కార్యాలయానికి బయలుదేరారు. ఈ క్రమంలో మార్గమధ్యంలో ఆయన కారుపై పలువురు కర్రలు, రాళ్లతో దాడి చేశారు.

ఆయన వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో డీఎస్పీ సుధాకర్‌ రెడ్డి సిబ్బందితో చేరుకొని అక్కడ ఉన్న స్థానికులను చెదరగొట్టారు. అనంతరం పోలీసు బందోబస్తు మధ్య ఎమ్మెల్సీ దొరబాబు అక్కడి నుంచి వెనుదిరిగారు. ఈ దాడిలో కారు అద్దాలు పాక్షికంగా ధ్వంసమయ్యాయి.  

click me!