కుప్పంలోనూ చంద్రబాబుపై అసంతృప్తి: నోటాకు పెరిగిన ఓట్లు

Published : May 26, 2019, 08:15 AM IST
కుప్పంలోనూ చంద్రబాబుపై అసంతృప్తి: నోటాకు పెరిగిన ఓట్లు

సారాంశం

పుంగనూరు, కుప్పం, తంబళ్లపల్లె నియోజకవర్గాల నోటాకు ఎక్కువగా వచ్చాయి. కుప్పం నియోజకవర్గం నుంచి చంద్రబాబు పోటీ చేసిన విషయం తెలిసిందే. ఈ మూడు నియోజకవర్గాల్లో వరుసగా 3287, 2905, 2886 మంది నోటా నొక్కారు. 

చిత్తూరు: తన సొంత నియోజకవర్గం కుప్పంలోనూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై అసంతృప్తి తీవ్రంగానే వ్యక్తమైనట్లు అర్థమవుతోంది. పుంగనూరు, కుప్పం, తంబళ్లపల్లె నియోజకవర్గాల నోటాకు ఎక్కువగా వచ్చాయి. కుప్పం నియోజకవర్గం నుంచి చంద్రబాబు పోటీ చేసిన విషయం తెలిసిందే. ఈ మూడు నియోజకవర్గాల్లో వరుసగా 3287, 2905, 2886 మంది నోటా నొక్కారు. 

2014లో ఈ సంఖ్య కేవలం 959, 905, 398గా ఉంది. ఇప్పుడు ఈ శాతం చాలా ఎక్కువగా పెరిగింది. పలమనేరులో  2014కు తాజా ఎన్నికలకు పెద్ద తేడా స్వల్పంగానే ఉంది. అప్పట్లో 2029 మంది ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 2561కు పెరిగింది. గతంలో 1018 మంది నోటాకు నొక్కగా ఇప్పుడు 1420 మంది ఉన్నారు. పలమనేరు, తిరుపతి పక్కనపెడితే.. మిగతా అన్ని నియోజకవర్గాల్లోనూ ఊహించనిరీతిలో నోటాకు ఓటర్లు పెద్ద యెత్తున ఓట్లు వేశారు.
 
పలమనేరు, తిరుపతి మినహా 2014 ఎన్నికల్లో ఎక్కడా నోటాకు వెయ్యికి మించి ఓట్లు పడలేదు. అత్యల్పంగా తంబళ్లపల్లెలో 398మం ది మాత్రమే నోటా వైపు మొగ్గు చూపారు. కానీ ఈసారి ఇక్కడా భారీగా పెరిగింది.

ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులెవరూ నచ్చకపోతే ఓటర్లు నోటా (నన్‌ ఆఫ్‌ ద అబౌ)కు నొక్కే అవకాశాన్ని ఎన్నికల కమిషన్‌ ప్రవేశపెట్టింది. ఈ ఏడాది 31వేల మంది ఓటర్లు నోటానే ఇష్టపడ్డారు. 2014 ఎన్నికలతో పోల్చుకుంటే ఈ సంఖ్య చాలా ఎక్కువ. ఆ ఎన్నికల్లో కేవలం 10,411 మంది నోటాకు ఓటేశారు. ఈసారి ఆ సంఖ్య ఏకంగా 31,377కు పెరిగింది. అంటే గతంతో పోల్చుకుంటే ఏకంగా రెండు శాతం పెరిగింది. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్