వైయస్ జగన్ ను కలిసిన హీరో మంచు విష్ణు దంపతులు

By Nagaraju penumalaFirst Published May 26, 2019, 8:08 AM IST
Highlights


ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించి తొలిసారిగా హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో తన నివాసానికి చేరుకున్న వైయస్ జగన్ ను విష్ణు దంపతులు కలిశారు. జగన్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారూ అంటూ జగన్ ను మంచు విష్ణు సంబోదిస్తూ ఆలింగనం చేసుకున్నారు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని సినీహీరో మంచు విష్ణు దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. 

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించి తొలిసారిగా హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో తన నివాసానికి చేరుకున్న వైయస్ జగన్ ను విష్ణు దంపతులు కలిశారు. 

జగన్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారూ అంటూ జగన్ ను మంచు విష్ణు సంబోదిస్తూ ఆలింగనం చేసుకున్నారు. ఇకపోతే ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో మంచు విష్ణు కుటుంబం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంది. 

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అంతేకాదు మండుటెండలను సైతం లెక్కచేయకుండా రాష్ట్రమంతటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అటు మంచు విష్ణు సైతం పలు నియోజకవర్గాల్లో పర్యటించారు. 

ముఖ్యంగా చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇకపోతే మంచు విష్ణుభార్య వైయస్ జగన్ కు చెల్లెలు అవుతుంది. వైయస్ కుటుంబానికి చెందిన విరానికా మంచు విష్ణును వివాహం చేసుకున్నారు. 

ఏపీ ఎన్నికల్లో మంచు విరానికా సైతం తెలుగుదేశం పార్టీ నేతలకు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం మోహన్ బాబు ఆయన తనయులు ర్యాలీలు చేస్తున్న సమయంలో టీడీపీ నేతలు జగన్ బంధువులు కాబట్టే ఇలా చేస్తున్నారంటూ టీడీపీ ఆరోపించింది. 

వైసీపీకి మద్దతుగానే ఇదంతా చేస్తున్నారంటూ నానా రభస చేసింది. దీంతో విరానికా వారికి గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. నేను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు మద్దతిస్తున్నానని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. 

అసలు నేనెందుకు మద్దతివ్వకూడదు? ఒకవేళ మీకు దీనిపై స్పష్టత లేకపోతే, మీకు కొన్ని విషయాలు చెబుతాను. వైఎస్ జగన్ నా అన్న, నా రక్తం. ఇక నా విషయానికి వస్తే, నాకెప్పుడూ నా కుటుంబమే తొలి ప్రాధాన్యత’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. 

అంటే, తాను మాత్రమే వైసీపీకి మద్దతు ఇస్తున్నట్లు విరానికా చెప్పినా.. పరోక్షంగా తన కుటుంబం వైసీపీ వెంటే ఉందని చెప్పకనే చెప్పారు. అంతేకాదు అప్నా టైమ్ ఆగయా అంటూ వైయస్ జగన్ కి సంబందించిన ఒక ఆడియోను కూడా విరానికి షేరే చేశారు.  

click me!
Last Updated May 26, 2019, 8:12 AM IST
click me!