
ఏలూరు : Hospitalకి వెళ్లే పని ఉండడంతో.. మేనమామ కొడుకు అని నమ్మి minor girl బాగోగులు చూసుకోమని అప్పగించినందుకు అభం శుభం తెలియని ఐదేళ్ల బాలికపై Sexual harassmentలకు పాల్పడ్డాడు ఓ ప్రబుద్ధుడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరు నగరంలోని ఓ ప్రాంతంలో నివాసముండే దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద పాప వయసు 5 యేళ్లు. మార్చి నెలలో ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న తన మామకు సపర్యలు చేసేందుకు పాప తల్లి, తండ్రి,చిన్న పాప వెళ్లారు. ఈ సమయంలో ఏలూరు నగరంలోని గొల్లాయిగూడెంలో నివాసముంటున్న వరుసకు మేనమామ కొడుకైన మున్నెల్ల శ్రావణ్ కుమార్ వద్ద పెద్ద పాపని ఉంచారు.
ఇతను ఆ ప్రాంతంలో వాలంటీరుగా పనిచేస్తన్నాడు. అవివాహితుడైన ఇతను తల్లితో కలిసి ఉంటున్నాడు. మూడు రోజులపాటు పాప అక్కడే ఉంది. ఆ తర్వాత తల్లిదండ్రులు ఇంటికి తీసుకువెళ్లారు. ఇదిలా ఉండగా, ఆ తరువాత శ్రావణ్ కుమార్ తమ ఇంటికి వచ్చినప్పుడల్లా పాప భయపడడం, కనిపించకుండా దాక్కోవడం గమనించారు తల్లిదండ్రులు. ముందు ఎందుకో అనుకున్నారు.. కానీ..బుధవారం కూడా ఇలా భయపడడం చూసి ఎందుకు భయపడుతున్నావని అడిగితే... అసలు విషయం వెలుగులోకి వచ్చింది. శ్రావణ్ కుమార్ డాబాపైకి తీసుకు వెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించారని చెప్పింది. దీంతో ఆమె దిశ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.
కాగా, మే 3న పంజాబ్ లో అభం శుభం తెలియని ఆరేళ్ల బాలికపై ఏడాదిగా నలుగురు molestationకి పాల్పడ్డారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనలో నిందితులు నలుగురూ minors కావడం.. పది, 11, 14 యేళ్లవారే కావడం గమనార్హం. సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఈ ఘటన పంజాబ్ లో చోటు చేసుకుంది. ఈ కేసులో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకోగా.. మరొకరు పరారీలో ఉన్నారు. punjabహోషియార్పూర్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ఆరేళ్ల బాలికపై నలుగురు బాలురు ఏడాదిగా అత్యాచారానికి పాల్పడ్డారు. మొదట తనకేం జరిగిందో తెలియని బాలిక.. ఆ తరువాత అది కంటిన్యూ అవుతుండడంతో ఇటీవల తన తల్లిదండ్రులకు ఆ girl ఈ విషయాన్ని తెలియజేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.
దీనిపై బాలిక తల్లిదండ్రులు ఇటీవల పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోక్సో చట్టంపై నలుగురు పై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో పోక్సో చట్టం కింద నలుగురి మీద పోలీసులు కేసు నమోదు చేశారు. అందులో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారిని జువైనల్ హోమ్ కు తరలించారు. వీరి వయస్సు పది పదకొండు సంవత్సరాలే. ఏడాదిపాటు పలుమార్లు బాలికపై వీరు అత్యాచారానికి పాల్పడినట్లు దర్యాప్తు అధికారి కమలేష్ కుమారి తెలిపారు. 14 ఏళ్ల వయసున్న మరో బాలుడు పరారీలో ఉన్నట్లు చెప్పారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.మైనర్లలో ఇలాంటి స్వభావం భయాందోళనలు కలిగిస్తోంది.