యువతితో సన్నిహిత వీడియోలు రికార్డ్ చేసి.. స్నేహితులకు షేర్ చేసి.. ఓ వాలంటీర్ ఘాతుకం...

Published : Jul 12, 2023, 09:21 AM IST
యువతితో సన్నిహిత వీడియోలు రికార్డ్ చేసి.. స్నేహితులకు షేర్ చేసి.. ఓ వాలంటీర్ ఘాతుకం...

సారాంశం

ఓ వాలంటీర్ ఓ యువతితో సన్నిహితంగా ఉండి, ఆమె ప్రైవేట్ వీడియోలు చిత్రీకరించి.. తన స్నేహితులకు పంపించాడు. అతనిపై కేసు నమోదయ్యింది.

సున్నిపెంట : ఆంధ్ర ప్రదేశ్ లోని నంద్యాల జిల్లాలో ఓ వాలంటీర్ ఘాతుకం వెలుగు చూసింది. ఓ యువతీ వ్యక్తిగత వీడియోలను చిత్రీకరించి వేధింపులకు పాల్పడుతున్నాడు. అతని మీద పోలీసులు కేసు నమోదు చేసినట్లుగా తెలిసింది. నంద్యాల జిల్లా సున్నిపెంటలో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది. దీనికి సంబంధించిన వివరాలలోకి వెళితే…

సున్నిపెంట ఈస్ట్రన్ కాలనీలోని సచివాలయం వన్ లో ఎలకపాటి పవన్ కళ్యాణ్ వాలంటీర్ గా పనిచేస్తున్నాడు. అతనికి  అక్కడ ఓ యువతితో రెండేళ్ల క్రితం పరిచయమే ఏర్పడింది. ఇద్దరూ సన్నిహితంగా ఉండేవారు. అలా సన్నిహితంగా ఉన్న సమయంలో వీడియోలు, అశ్లీల చిత్రాలు తీశాడు. అయితే, అవి ఇటీవల వేరే వ్యక్తి ద్వారా వెలుగు చూడడంతో కలకలం రేగింది.

ఏపీ ఆరోగ్య మంత్రి విడదల రజినికి అస్వస్థత.. చికిత్స అందిస్తున్న వైద్యులు...

ఆ వీడియోలు, ఫోటోలు తన స్నేహితులకు పంపినట్లుగా తేలింది. ఈ ఫోటోలు పవన్ కళ్యాణ్ స్నేహితుడైన రాంబాబు ద్వారా వెలుగు చూశాయి. యువతి కుటుంబ సభ్యుల దృష్టికి ఈ విషయం వెళ్ళింది. దీంతో బాధిత యువతి పోలీసులను ఆశ్రయించింది.  పవన్ కళ్యాణ్, రాంబాబుల మీద ఫిర్యాదు చేసింది. వారి మీద వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వారిని విచారిస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు.

ఇదిలా ఉండగా, కర్ణాటకలో ఇలాంటి ఓ దారుణమైన ఘటన వెలుగు చూసింది. కట్టుకున్న భార్య మీదికి స్నేహితులను లైంగిక దాడికి ఉసిగొలిపాడు. మద్యానికి డ్రగ్స్ కు బానిసైన ఆ భర్త.. భార్యకు నరకం చూపెడుతూ ఇంట్లోనే మందు పార్టీలు, స్నేహితులతో విచ్చలవిడిగా ప్రవర్తించాడు.  అంతటితో ఆగకుండా స్నేహితులను భార్య మీద లైంగిక వేధింపులకు ఉసిగొలిపాడు ఆ శాడిస్ట్ మొగుడు. ఆ వేధింపులు తాళలేక.. ఆమె పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగు చూసింది. ఈ ఘటన కర్ణాటకలోని ఐటీ సీటీ బెంగుళూరులో చోటుచేసుకుంది.

ఆంధ్రప్రదేశ్లోని కాకినాడకు చెందిన అఖిలేష్ ధర్మరాజ్, బెంగళూరుకు చెందిన ఓ యువతీ ప్రొఫైల్ లో మ్యాట్రిమోనియల్ సైట్ లో చూసి ఇష్టపడ్డాడు. 2019లో వీరికి మొదట అలా పరిచయం ఏర్పడింది. ఇద్దరికీ ఒకరంటే ఒకరు నచ్చడంతో బెంగుళూరు జయనగర్ లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని ఒకటయ్యారు. ఇద్దరూ మంచి ఐటీ ఉద్యోగులే. 

అయితే, కొద్ది రోజుల తర్వాత ధర్మరాజు మద్యం, డ్రగ్స్ కు అలవాటు పడ్డాడు. బయట తాగడమే కాకుండా ఇంటికే తీసుకొచ్చి తాగుతుండేవాడు. ఆ మత్తులో భార్యను తీవ్ర వేధింపులకు గురి చేసేవాడు. అంతేకాకుండా తరచుగా ఇంటికి స్నేహితులను తీసుకువచ్చి మద్యం పార్టీలు, డ్రగ్స్ పార్టీలు చేసుకునేవాడు.

మద్యం, డ్రగ్స్ మత్తులో స్నేహితులతో కలిసి భార్యను వేధింపులకు గురి చేయడమే కాకుండా అత్యాచారానికి పురిగొలుపుతుండేవాడు. ఆమె తీవ్రంగా వ్యతిరేకించడంతో భార్యకు తెలియకుండా ఆమె ప్రైవేటు వీడియోలను తీసి బ్లాక్ మెయిల్ కు పాల్పడేవాడు. భార్యకు తెలియకుండా బెడ్రూంలో, బాత్రూంలో సీసీ కెమెరాలు పెట్టి రికార్డు చేసేవాడు. ఈ వేధింపులు తట్టుకోలేక ఆమె పుట్టింటికి వెళితే అక్కడికి ఫోన్ చేసి.. ఇంటికి తిరిగి వచ్చేయాలని.. లేదంటే వీడియోలు అక్కడికే వచ్చే అందరికీ చూపిస్తానని.. చంపేస్తానని బెదిరించేవాడు.  

తనతో పాటు తన స్నేహితులకు కూడా సహకరించాలని బ్లాక్మెయిల్ చేసేవాడు. ఈ వేధింపులు తట్టుకోలేక ఆమె హెచ్ఎస్ఆర్ లేఅవుట్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా బాధితురాలు తెలిపింది. ఆమె ఫిర్యాదును తీసుకున్న పోలీసులు… భర్త అతని స్నేహితుల మీద కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్