
అనంతపురం: ధరఖాస్తు చేసుకున్న Farmers పంటల భీమా పథకం ఇవ్వకపోవడంతో Nagesh Naik అనే వలంటీర్ తన చెప్పుతో తానే కొట్టుకున్నాడు. ఈ ఘటన Sri Sathya Sai ,జిల్లాలో కలకలం రేపుతుంది. సత్యసాయి జిల్లాలోని Kadiri మండలం Ramdas Naik Thanda లో 50 మంది రైతులు పంటల భీమా చేయించారు. అయితే ఒక్క రైతుకు పంటల భీమా అందింది. మిగిలిన రైతులకు రైతుల భీమా అందలేదు. అర్హులైన వారందరికీ పంటల భీమాను వర్తింపజేయాలని వ్యవసాయ అధికారులు, సచివాలయ సిబ్బందిని కోరినా పట్టించుకోలేదని గ్రామ వలంటీర్ నగేష్ నాయక్ ఆరోపిస్తున్నారు.
గ్రామంలోకి వెళ్తే తమను రైతులు shoe తో కొట్టేలా ఉన్నారని అధికారులతో చెబుతూ గ్రామ వలంటీర్ నగేష్ తన చెప్పుతో తానే కొట్టుకుని అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేశాడు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చెప్పుతో కొట్టుకున్న తర్వాత నగేష్ నాయక్ అక్కడి నుండి వెళ్లిపోయారు.