కర్నూల్ లో కూలీకి దొరికిన వజ్రం: రూ. 45 వేలకు విక్రయం

By narsimha lodeFirst Published Jun 21, 2022, 9:35 AM IST
Highlights


కర్నూల్ జిల్లాలో వ్యవసాయ పనులకు వెళ్లిన కూలీకి వజ్రం లభించింది. ఈ వజ్రాన్ని కూలీ స్థానికంగా ఉన్న వ్యాపారికి రూ. 45  వేలకు విక్రయించారు. ప్రతి ఏటా ఈ ప్రాంతంలో వజ్రాల కోసం వేట కొనసాగిస్తారు.కర్నూల్ జిల్లా వాసులే కాదు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కూడా వజ్రాల వేట కోసం ఇక్కడికి వస్తుంటారు.

కర్నూల్: Kurnool  జిల్లా Tuggaliమండలం Pagidiraiలో  పొలం పనులకు వెళ్లిన కూలీకి Diamond లభించింది.  రూ. 45 వేలకు ఈ వజ్రాన్ని కూలీ స్థానికంగా ఉన్న Diamond Merchant విక్రయించాడు.  ప్రతి ఏటా తొలకరి వర్షాలు ప్రారంభం కాగానే ఈ ప్రాంతంలో వజ్రాల కోసం  అన్వేషణ చేస్తారు. 

2021 మే 27న కర్నూల్ జిల్లాలోని తుగ్గలి మండలంలో అత్యంత విలువైన వజ్రాలు దొరుకుతున్నాయి. జొన్నగిరి, పగిడిరాయి, జీ ఎర్రగుడి, పెరవలి ప్రాంతంలో ఇవి లభ్యమవుతున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చిన్న జొన్నగిరిలో ఒక రైతుకు విలువైన వజ్రం దొరికింది. పొలంలో పనులు చేస్తున్న ఆ రైతుకు వజ్రం దొరికింది. రహస్యంగా టెండర్ వేశారు. ఈ వజ్రాన్ని రూ.కోటి 25 లక్షలకు కొనుగోలు చేశారు గుత్తికి చెందిన వ్యాపారులు. అది బహిరంగ మార్కెట్‌లో రూ. 3కోట్లకు పైగా విలువ చేస్తుందని వ్యాపారులు చెబుతున్నారు. 

2021 మే 29వ తేదీన తుగ్గలి మండలం జొన్నగిరిలో రెండు వజ్రాలు లభ్యమయ్యాయి. బొప్పాయి తోటలో కలుపు తొలగిస్తున్న మహిళా కూలీకి ఓ వజ్రం దొరికింది. ఆ వజ్రాన్ని ఓ వ్యాపారి రూ.70 వేలకు కొనుగోలు చేశారు. అదే విధంగా పొలంలో వ్యవసాయ పనులు చేస్తున్న మరో మహిళా కూలీకి  ఓ వజ్రం లభించింది. దాన్ని పెరవలికి చెందిన వ్యాపారికి రూ.40 వేలకు విక్రయించారు.

జిల్లా వాసులే కాదు అనంతపురం, కడప, ప్రకాశం, కర్ణాటకలోని బళ్లారి, తెలంగాణలోని పలువురు వజ్రాల కోసం ఈ ప్రాంతంలో వెతుకుతుంటారు. 

జిల్లాలోని జొన్నగిరి, తుగ్గలి, మద్దికెరా, పగిడిరాయ్, పెరావళి, మహానంది, మహాదేవపురం ప్రాంతాల్లో వజ్రాల కోసం ఏళ్ల తరబడి అన్వేషణ సాగిస్తున్నారు. వర్షాకాలం ప్రారంభమైన జూన్ నుండి నవంబర్ వరకు పొలాల్లో  వజ్రాల కోసం అన్వేషణ  చేస్తుంటారు. 

విజయనగర సామ్రాజ్యానికి చెందిన శ్రీకృష్ణదేవరాయుడు, ఆయన మంత్రి తిమ్మరుసు  ఆలయం సమీపంలో వజ్రాలు, బంగారం ఆభరణాల నిధిని దాచిపెట్టారని స్థానికులు నమ్ముతారు. అందుకే ప్రతి ఏటా సిరివెళ్ల మండల ప్రధాన కార్యాలయంలోని నరసింహా ఆలయం చుట్టూ వజ్రాల కోసం వెతుకుతారు.

కొన్ని విదేశీ సంస్థలు, సైంటిస్టులు, అమెరికా, అస్ట్రేలియా శాస్త్రవేత్తలు ఈ ప్రాంతంలో ఐదేళ్లుగా వజ్రాల కోసం అన్వేషిస్తున్నాయి. మహాదేవపురం వద్ద 50 ఎకరాల భూమిని ఈ కంపెనీలు లీజుకు తీసుకొన్నాయి. భారీ యంత్రాలను ఉపయోగించి తవ్వకాలు చేపట్టాయి.
 

click me!