డబ్బులివ్వడానికి వెళ్లి.. వృద్దురాలిని హతమార్చిన వాలంటీర్..

Published : Jul 31, 2023, 08:23 AM IST
డబ్బులివ్వడానికి వెళ్లి.. వృద్దురాలిని హతమార్చిన వాలంటీర్..

సారాంశం

విశాఖ జిల్లా పెందుర్తిలో సుజాతానగర్ సచివాలయంలో వాలంటీర్ అత్యాశకుపోయి యజమాని తల్లిని హతమార్చాడు. ఇదంతా సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. 

విశాఖపట్నం :  ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో దారుణ ఘటన వెలుగు చూసింది. అత్యాశతో ఓ వాలంటీర్ వృద్ధురాలిని హతమార్చాడు.  విశాఖ జిల్లా పెందుర్తిలో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది.  సుజాతనగర్ సచివాలయంలో వాలంటీర్ గా పనిచేస్తున్న ఓ వ్యక్తి పార్ట్ టైంగా చికెన్ షాప్ లో జాబ్ చేస్తున్నాడు. విధులు ముగించుకున్న తర్వాత ఆ రోజు కలెక్షన్ యజమాని ఇంట్లో ఇవ్వమని చెప్పడంతో… డబ్బులతో యజమాని ఇంటికి వెళ్ళాడు.  

ఆ సమయంలో యజమాని తల్లి తలుపు తీసింది.  ఆమె మెడలో బంగారు గొలుసులు చూసేసరికి వాలంటీర్ కు దురాశ పుట్టింది. బంగారు గొలుసుల కోసం హత్య చేసి.. గొలుసులతో పారిపోయాడు. అయితే ఈ ఘటన అంతా అక్కడ సీసీ కెమెరాల్లోని రికార్డు అయింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు వాలంటీర్ కోసం వెతుకుతున్నారు.  దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం
IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్