విజయనగరం జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదం కారణంగా కొన్ని రైళ్లు రద్దయ్యాయి. మరికొన్నింటిని మరికొన్ని దారి మళ్లించింది రైల్వే శాఖ.
విజయనగరం : ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం దగ్గర జరిగిన రైలు ప్రమాదం నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేసినట్టుగా రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో సోమవారం పలు రైళ్ల రద్దయ్యాయి. విశాఖ-రాయపూర్ ప్యాసింజర్ రైలు రద్దు, విశాఖ రాయపూర్ మధ్య నడిచే కొర్చా రైలు రద్దు, పారదీప్-విశాఖపట్నం, రాయగడ-విశాఖపట్నం, పలాస-విశాఖపట్నం, విశాఖపట్నం - గుణుపూర్, గుణుపూర్-విశాఖపట్నం, విజయనగరం-విశాఖపట్నం రైళ్లు రద్దయ్యాయి. ఇక కోణార్క్, ఫలక్ నుమా, నాగవల్లి రైళ్లను విజయనగరం, టిట్లాగఢ్, నాగపూర్, కాజీపేట మీదుగా దారి మళ్లించారు. పూరీ- తిరుపతి రైలును బల్గాం దగ్గర నిలిపివేశారు.
రైలు ప్రమాద స్థానిక రెస్క్యూ ఆపరేషన్ టీం చేరుకుంది. రైల్వే అధికారులు బాహుబలి క్రేన్ ను రంగంలోకి దించారు. నుజ్జునుజైన బోగీలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. కాగా ఈ ప్రమాదంలో ఇప్పటికే 10 మంది మృతి చెందారు. 54మందికి పైగా గాయపడ్డారు.