భవిష్యత్తులో లాభాలే, అయినా కేంద్రం అమ్మేస్తోంది: ఆర్టీఐ ప్రశ్నకు స్టీల్ ప్లాంట్ సమాధానం

By Siva KodatiFirst Published Mar 30, 2021, 3:49 PM IST
Highlights

విశాఖ ఉక్కుకు భవిష్యత్తులో మంచి లాభాలొస్తాయని స్టీల్ ప్లాంట్ యాజమాన్యం స్పష్టం చేసింది. ఆర్టీఐ కార్యకర్త రమేశ్ చంద్ర వర్మ అడిగిన ప్రశ్నకు సమాధానిమిచ్చింది యాజమాన్యం

విశాఖ ఉక్కుకు భవిష్యత్తులో మంచి లాభాలొస్తాయని స్టీల్ ప్లాంట్ యాజమాన్యం స్పష్టం చేసింది. ఆర్టీఐ కార్యకర్త రమేశ్ చంద్ర వర్మ అడిగిన ప్రశ్నకు సమాధానిమిచ్చింది యాజమాన్యం. వార్షిక బ్యాలెన్స్ షీటు ప్రకారం.. స్టీల్ ఫ్యాక్టరీ భవిష్యత్తులోనూ లాభాలు గడిస్తుందని చెప్పింది.

2015- 2020 మధ్యకాలంలో పేరుకుపోయిన నష్టాలను చల్లించాల్సిన పన్నులు మినహాయించినా కూడా లాభాలు వస్తాయని స్పష్టం చేసింది. లాభాలు వచ్చే అవకాశాలు వున్నా స్టీల్ ప్లాంట్‌ను కేంద్ర ప్రభుత్వం అమ్మకానికి పెట్టిందని యాజమాన్యం తన సమాధానంలో తెలిపింది. 

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ జరిగి తీరుతుందని కేంద్రం తెగేసిచెప్పింది. అందులో నూటికి నూరు శాతం పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు.

ఈ ఏడాది జనవరి 27న జరిగిన కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ సమావేశంలో దీనిపై సూత్రప్రాయంగా నిర్ణయించామని వెల్లడించారు. ఉక్కు కర్మాగారంతో పాటు దాని అనుబంధ సంస్థలు, జాయింట్‌ వెంచర్లలో వాటాలను కూడా వ్యూహాత్మకంగా ఉపసంహరించుకుంటున్నట్లు చెప్పారు.

ఈ స్టీల్‌ ప్లాంట్‌లో రాష్ట్ర ప్రభుత్వానికి ఈక్విటీ లేదన్నారు. అయితే నిర్దిష్ట అంశాల్లో అవసరమైనప్పుడల్లా రాష్ట్రప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నామని లోక్‌సభలో ఆమె తెలిపారు.
 

click me!