ఆనందయ్య కరోనా మందుకు ల్యాబ్ నుంచి పాజిటివ్ నివేదిక: రాములు

By telugu team  |  First Published May 22, 2021, 12:45 PM IST

నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో బొనిగె ఆనందయ్య ఇస్తున్న కరోనా మందుపై ఆయూష్ కమిషనర్ రాములు శుభవార్త చెప్పారు. మందుకు వాడుతున్న పదార్థాలు శాస్త్రీయంగానే ఉన్నాయని ఆయన చెప్పారు.


నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో బొనిగె ఆనందయ్య ఇస్తున్న కరోనా మందుపై ఆయుష్ కమిషనర్ రాములు శుభవార్త చెప్పారు. మందు తయారీలో వాడే పదార్థాలన్నీ శాస్త్రీయంగానే ఉన్నాయని, మందు తయారీ పదార్థాలపై ల్యాబ్ నుంచి పాజిటివ్ నివేదిక వచ్చిందని ఆయన చెప్పారు.

ఆనందయ్య మందు ఎలా తయారు చేస్తున్నారో పరిశీలిస్తామని రాములు చెప్పారు. ఆనందయ్య కరోనా మందుపై రాములు ఆధ్వర్యంలోనే అధ్యయనం జరుగుతోంది. రాములు ఎదుట ఆనందయ్య ఆయుర్వేద మందు తయారీని చూపిస్తారు. ఈ సందర్భంగా రాములు మీడియాతో మాట్లాడారు 

Latest Videos

undefined

Also Read: అనందయ్యని జాతీయ నిధిగా గుర్తించి సైనిక సెక్యూరిట కల్పించాలిః రామ్‌గోపాల్‌ వర్మ ట్వీట్లు

శుక్రవారంనాడు ముత్తుకూరులో కొంత మందితోనూ ఆనందయ్య వద్ద పనిచేసేవారితోనూ మాట్లాడామని ఆయన చెప్పారు. ఆనందయ్య వద్ద మందు తీసుకున్నవారి అభిప్రాయాలు కూడా తీసుకుంటామని ఆయన చెప్పారు.  ఐసిఎంఆర్ పరిశీలన తర్వాత వారితో కూడా సమన్వయం చేసుకుంటామని ఆయన చెప్పారు.మందు తయారీ అధ్యయనం తర్వాత నివేదికకు వారంపైనే పడుతుందని రాములు చెప్పారు. 

Also Read: రాజమండ్రిలో మరో ఆనందయ్య: కరోనాకు వసంత కుమార్ మందు

ఆనందయ్య ఆయుర్వేద మందుపై ఐసిఎంఆర్, ఆయూష్ బృందాలు అధ్యయనం చేస్తున్నాయని జాయింట్ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ చెప్పారు. నివేదికకు వారం, పది రోజులు పట్టవచ్చునని ఆయన అన్నారు తుదిగా ప్రభుత్వ అనుమతి వచ్చిన తర్వాతనే మందు పంపిణీని చేపడుతామని ఆయన చెప్పారు. అప్పటి వరకు ప్రజలు ఎవరు కూడా కృష్ణపట్నం రావద్దని ఆయన కోరారు. 

click me!