డాక్టర్ సుధాకర్ పరిస్థితే జడ్జి రామకృష్ణకు...: మాజీ మంత్రి ఆందోళన

By Arun Kumar PFirst Published May 22, 2021, 1:01 PM IST
Highlights

పదిమందికి వైద్యం చేసే వ్యక్తిని పిచ్చివాడిని చేసిన వైనం అత్యంతహేయమని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ఆవేధన వ్యక్తం చేశారు. 

గుంటూరు: డాక్టర్ సుధాకర్ మెడరెక్కలు విరిచికట్టి, పిచ్చివాడిగా ముద్రవేసి ప్రభుత్వం పిచ్సాసుపత్రికి పంపిన ఘటన ఎవరూ మర్చిపోలేదని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ఆవేధన వ్యక్తం చేశారు. పదిమందికి వైద్యం చేసే వ్యక్తిని పిచ్చివాడిని చేసిన వైనం అత్యంతహేయమని మాజీ మంత్రి అన్నారు. 

తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో డాక్టర్ సుధాకర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు మాజీ మంత్రులు నక్క ఆనంద్ బాబు, ఆలపాటి రాజేంద్రప్రసాద్. ఈ సందర్భంగా ఆనంద్ బాబు మాట్లాడుతూ... సుధాకర్ మరణవార్త తీవ్రంగా కలిచివేసిందన్నారు. ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు ఆనంద్ బాబు తెలిపారు. 

video డాక్టర్ సుధాకర్ చిత్రపటానికి చంద్రబాబు నివాళి

''దళితుల ఓట్లతో గెలిచిన వైసీపీ, పల్నాడులో ఆత్మకూరు నుంచే ఆయావర్గాలపై దమనకాండ ప్రారంభించింది. డాక్టర్ వనజాక్షిని వేధించడం, కిరణ్ కుమార్ ను కొట్టిచంపడం, ఓంప్రతాప్ మరణం, వరప్రసాద్ కు శిరోముండనం వంటి ఘటనల్లో ప్రభుత్వం దళితులకు ఏం న్యాయం చేసింది?'' అని నిలదీశారు. 

''జడ్జీ రామకృష్ణకు జస్టిస్ నాగార్జున రెడ్డికి ఎప్పటినుంచో బేధాభిప్రాయాలున్నాయి. రెండునెలల నుంచి చిత్తూరు జిల్లాలోని జైళ్లచుట్టూ రామకృష్ణను తిప్పుతున్నారు. నేడు సుధాకర్ లాగానే రేపు రామకృష్ణ కూడా ప్రభుత్వ దారుణలకు బలైపోతాడని భయమేస్తోంది'' అని ఆనంద్ బాబు ఆందోళన వ్యక్తం చేశారు. 

''అంబేద్కర్ స్ఫూర్తితో దళితులంతా ఒక్కతాటిపై నిలిచి ప్రభుత్వానికి, పాలకులకు వ్యతిరేకంగా పోరాడాలి. కులాలు, మతాలు లేవంటూనే దళితులపై ఎందుకింతలా కక్ష సాధింపులు? రాజ్యాంగం ప్రకారం దళితులకు దక్కాల్సిన హక్కులను జగన్మోహన్ రెడ్డి కాలరాస్తున్నాడు. బడ్జెట్ సహా అన్నింటిలో జగన్ దళితులను మోసగిస్తూనే ఉన్నాడు'' అని ఆనంద్ బాబు మండిపడ్డాడు. 

click me!