మహానాడు మధ్యలో అలిగిన టిడిపి ఎమ్మెల్యే

First Published May 28, 2017, 12:45 PM IST
Highlights

నగరంలో కొత్తగా నిర్మించిన పార్టీ కార్యాలయంలో జరిగే విగ్రహావిష్కరణ కార్యక్రమంలో అలుక సీను చోటుచేసుకుంది. విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్,తన మందీ మార్బలంతో టీడీపీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అయితే ఎమ్మెల్యేను  మాత్రమే కార్యాలయంలోకి అనుమతిస్తామని, సైన్యానికి అనుమతి లేదని సెక్యూరిటీ సిబ్బంది చెప్పారు. ఇంతమంది ముందర అవమానమా...

మహానాడు సంబరం జోరుగా ఉన్నా, మరొకవైపు అలకలు,కంటతడిపెట్టడాలుకూడ  ఉన్నాయి.  ఈ రోజు ఒక ఎమ్మెల్యే అలిగి విశాఖటిడిపి  కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ నుంచి వెళ్లిపోయారు. తర్వాత డిప్యూటి సిఎం చిన్న రాజప్ప బుజ్జగించి బతిమాలి పట్టుకొచ్చారు.

 

నిన్న తనను స్టేజి మీదకు పిలవకుండాఅవమానించారిన అర్గనైజంగ్ కార్యదర్శి, సినీనటి కవిత కంట తడిపెట్టి మహానాడు బహిష్కరించిన సంగతి తెలిసిందే.

 

నగరంలో కొత్తగా నిర్మించిన పార్టీ కార్యాలయంలో జరిగే  ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో  ఈ అలుక సీను చోటుచేసుకుంది. విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్,తన మందీ మార్బలంతో టీడీపీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అయితే ఎమ్మెల్యేను  మాత్రమే కార్యాలయంలోకి అనుమతిస్తామని, ఆయన సైన్యానికి అనుమతి లేదని సెక్యూరిటీ సిబ్బంది చెప్పారు.  ఎమ్మెల్యే గారి అనుచరులను అడ్డుకున్నారు.

 

దీంతోవాసుకు తెగ కోసం మొచ్చింది. తన వాళ్ల ముందే తననిలా అవమానించారని ఆయన తెగ ఫీలయ్యారు. కార్యక్రమం బహిష్కరించి టీడీపీ ఆఫీస్‌ నుంచి వెళ్లిపోయారు.

 

ఈ సమాచారం తెలుసుకున్న హోంమంత్రి డిప్యూటీ సీఎం చినరాజప్ప రంగంలోకి దిగి మంటలనార్పేందుకు పూనుకున్నారు.

 

 ఎమ్మెల్యేను పిలిపించారు. ఈ సమయంలో రచ్చచేయడం మంచిదికాదని సర్దిచెప్పారు. శాంతించి ఎమ్మెల్యే పార్టీ కార్యాలయంలో జరిగిన విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇంతచేసినా ఆయన పరివారానికి అనుమతి రాలేదు.

 

click me!