విశాఖ ప్రేమోన్మాది దాడి: ఆ తలుపు గడియ ఎవరు వేశారు..?

Siva Kodati |  
Published : Dec 03, 2020, 02:48 PM IST
విశాఖ ప్రేమోన్మాది దాడి: ఆ తలుపు గడియ ఎవరు వేశారు..?

సారాంశం

విశాఖలో ప్రేమను నిరాకరించిందని ప్రియాంక అనే యువతిపై ప్రేమోన్మాది దాడి చేయడం తెలుగు నాట సంచలనం సృష్టించింది. అయితే నిందితుడు శ్రీకాంత్ పథకం ప్రకారం ఈ దారుణానికి ఒడిగట్టినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది

విశాఖలో ప్రేమను నిరాకరించిందని ప్రియాంక అనే యువతిపై ప్రేమోన్మాది దాడి చేయడం తెలుగు నాట సంచలనం సృష్టించింది. అయితే నిందితుడు శ్రీకాంత్ పథకం ప్రకారం ఈ దారుణానికి ఒడిగట్టినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది.

శ్రీకాంత్‌పై ఐపీసి సెక్షన్‌ 307, 452, 354a 354d, 309 కింద కేసు నమోదయ్యింది. శ్రీకాంత్  ఇంతకుముందు కూడా ఆకతాయిగా తిరుగుతూ పలువురు యువతులతో అసభ్యంగా ప్రవర్తించినట్టు పోలీసుల దృష్టికి వచ్చింది.

అలాగే ప్రియాంక, శ్రీకాంత్‌లు గతకొన్ని రోజులుగా ప్రేమించుకుంటున్నట్లు తెలిసింది. ఆమెతో సన్నిహితంగా ఫోటోలు దిగి వాటిని ఫేస్‌బుక్‌లో పెట్టి బ్లాక్‌ మెయిల్‌ చేశాడని స్థానికులు అంటున్నారు. 

అయితే ఈ కేసు దర్యాప్తులో ఓ తలుపు గడియ మిస్టరీగా మారింది. ప్రియాంక గదిలో ఉన్న సమయంలో శ్రీకాంత్ వెళ్లి దాడి చేశాడు. బ్లేడ్ తో విచక్షణారహితంగా గొంతు కోసేశాడు. అయితే ప్రాణాల కోసం తీవ్రంగా ప్రతిఘటించిన ఆమె తలుపు తీయడానికి ప్రయత్నించింది.

కానీ బయట గడియ పెట్టి ఉండడంతో రాలేకపోయింది. ఆ సమయంలో ఇంట్లో వస్తువులు జాగ్రత్తగా చూడమని ప్రియాంక తల్లి లక్ష్మణ్ అనే యువకుడ్ని ఇంటికి పంపించగా అతను తలుపు గడియ తీయడంతో ప్రియాంక బయటకు వచ్చినట్టు స్థానికులు చెబుతున్నారు.

అయితే అప్పటి వరకూ బయట ఉన్న శ్రీకాంత్ గదిలోకి ఎలా వెళ్ళాడు ? అతను వెళ్ళిన తర్వాత తలుపు గడియ బయటే ఎవరు పెట్టారు అన్న విషయం ఒక మిస్టరీగా మారింది.

నిజంగా బయట గడియ పెట్టి లేకుంటే శ్రీకాంత్ దాడి నుంచి ప్రియాంక బయట పడే అవకాశాలు ఉంటాయి. యాదృశ్చికంగా ప్రియాంక కుటుంబ సభ్యులు బయట గడియ పెట్టారా లేక ఇతరులు ఎవరైనానా తలుపు గడియ పెట్టారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

Hello Lokesh Interaction: హలో లోకేష్ కార్యక్రమంలోవిద్యార్థులతో లోకేష్ పంచ్ లు | Asianet News Telugu
Minister Nara Lokesh: మంత్రి లోకేష్ నే ర్యాగింగ్ చేసిన విద్యార్థి అందరూ షాక్| Asianet Telugu