Viveka Murder Case : అప్రూవర్ గా మారనున్న మాజీ డ్రైవర్ దస్తగిరి...

By AN Telugu  |  First Published Nov 12, 2021, 8:49 AM IST

చార్జిషీటు వేయడానికి ముందు అంటే అక్టోబర్ 22న దస్తగిరి కడప సబ్ కోర్టులో ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. అదేరోజు సిబిఐ కడప సబ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. షేక్ దస్తగిరి సీఆర్పీసీ 306 సెక్షన్ కింద  అప్రూవర్ గా మారుతున్నారని ఆ పిటిషన్లో పేర్కొంది.


కడప :  మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆయన మాజీ డ్రైవర్ దస్తగిరి అప్రూవర్ గా మారనున్నారు.  నిందితుడు దస్తగిరి మారుతున్నారని విచారణకు సహకారం అందిస్తున్న కారణంగా అతని సాక్ష్యాన్ని నమోదు చేయాలని CBI officials కడప సబ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  Viveka murder caseకు సంబంధించి అక్టోబర్ 26న పులివెందుల కోర్టులో సీబీఐ ప్రాథమిక ఛార్జిషీట్ దాఖలు చేసింది. అందులో సునీల్ యాదవ్, ఉమా శంకర్ రెడ్డి, దస్తగిరి లను నిందితులుగా చేర్చింది.

చార్జిషీటు వేయడానికి ముందు అంటే అక్టోబర్ 22న దస్తగిరి కడప సబ్ కోర్టులో ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. అదేరోజు సిబిఐ Kadapa Sub Courtలో పిటిషన్ దాఖలు చేసింది. షేక్ దస్తగిరి సీఆర్పీసీ 306 సెక్షన్ కింద  అప్రూవర్ గా మారుతున్నారని ఆ పిటిషన్లో పేర్కొంది.  వివేకా హత్య కేసులో  దస్తగిరితో పాటు  ఎర్ర గంగిరెడ్డి,  సునీల్ యాదవ్, ఉమా శంకర్ రెడ్డి ప్రమేయం ఉన్నట్లు తెలిపింది. 

Latest Videos

ఇంతకుముందు దస్తగిరి సిబిఐకి, మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చారు. ఈ పిటిషన్ పై గురువారం విచారణ జరిగింది.  కేసు పురోగతి విషయంలో సహకరించడానికి దస్తగిరి సిద్ధంగా ఉన్నాడని కోర్టుకు సిబిఐ తెలిపింది. హత్యకు సంబంధించిన అన్ని విషయాలు Dastagiriకి తెలుసని వెల్లడించింది.  కేసు దర్యాప్తు ముందుకు సాగాలంటే అతని సాక్ష్యం నమోదు చేయాలని విజ్ఞప్తి చేసింది.

దీనిపై మిగతా ముగ్గురు నిందితుల తరఫు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు.  దస్తగిరి నుంచి రికార్డు చేసిన స్టేట్మెంట్,  మెజిస్ట్రేట్ ముందు ఇచ్చిన వాంగ్మూలం పత్రాలు  చూసిన తర్వాతే  కౌంటర్ వేస్తామని తెలిపారు.  న్యాయవాదుల వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం ఆ పత్రాలు ఇవ్వాలని సిబిఐకి సూచిస్తూ విచారణను ఈనెల 17వ తేదీకి వాయిదా వేసింది.

చాలా అవమానంగా ఉంది.. వివేకా కేసును తేల్చండి: సీబీఐతో జగన్ మేనమామ, ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి

ఇదిలా ఉండగా, సెప్టెంబర్ 9, గురువారం నాడు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ అధికారులు కడప జిల్లా సింహాద్రిపురం మండలం కుంచేకులకు చెందిన ఉమాశంకర్ రెడ్డిని ఉదయం నుంచి సిబిఐ అధికారులు విచారించారు. ఆ తర్వాత సాయంత్రం అరెస్టు  చేసి పులివెందుల కోర్టులో హాజరుపరిచారు. ఇంతకు ముందు సునీల్ యాదవ్ ను సిబిఐ అరెస్టు చేశారు.

అంతకు ముందు ఉమాశంకర్ రెడ్డిని ఐదు రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సిబిఐ పులివెందుల కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వైఎస్ వివేకానంద రెడ్డి పొలం పనులు చేసే జగదీశ్వర్ రెడ్డి సోదరుడు ఉమా శంకర్ రెడ్డి. కోర్టు ఉమాశంకర్ రెడ్డికి సెప్టెంబర్  23వ తేదీ వరకు రిమాండ్ విధించింది. . 

వైఎస్ వివేకా హత్య కేసులో సునీల్ యాదవ్, ఉమా శంకర్ పాత్రపై ఆధారాలున్నాయని, హత్య కేసులో ఇద్దరు కుట్రలో పాల్గొన్నారని, ఉమాశంకర్ పాత్రపై సునీల్ విచారణలో చెప్పారని సిబిఐ రిమాండ్ రిపోర్టులో తెలిపింది. వివేకా హత్యకు ముందు ఆయన నివాసంలోని కుక్కను చంపేశారని సిబిఐ చెప్పింది. సునీల్, ఉమాశంకర్ కలిసి కారుతో ఢీకొట్టి  కుక్కను చంపారని చెప్పింది. 

హత్య చేయడానికి ఉమా శంకర్, సునీల్ బైక్ మీద వెళ్లారని, ఉమాశంకర్ బైక్ లో గొడ్డలి పెట్టుకుని పారిపోయాడని సిబిఐ తెలిపింది. బైక్ ను, గొడ్డలిని స్వాధీనం చేసుకున్నట్లు సిబిఐ తన రిమాండ్ రిపోర్టులో తెలిపింది. గత నెల 11వ తేదీన ఉమాశంకర్ ఇంట్లో రెండు చొక్కాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. 
 

click me!