గుంటూరు కలెక్టర్‌గా వివేక్ యాదవ్.. ఎస్ఈసీ సూచన మేరకే

By Siva KodatiFirst Published Feb 3, 2021, 6:16 PM IST
Highlights

గుంటూరు కలెక్టర్‌గా వివేక్ యాదవ్‌ను నియమించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. గుంటూరు కలెక్టర్ కోసం సర్కార్ ప్యానెల్ పంపగా, వివేక్ యాదవ్‌ను గుంటూర్ కలెక్టర్‌గా నియమించేందుకు ఎస్ఈసి అంగీకరించింది.

గుంటూరు కలెక్టర్‌గా వివేక్ యాదవ్‌ను నియమించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. గుంటూరు కలెక్టర్ కోసం సర్కార్ ప్యానెల్ పంపగా, వివేక్ యాదవ్‌ను గుంటూర్ కలెక్టర్‌గా నియమించేందుకు ఎస్ఈసి అంగీకరించింది.

దీంతో ఆయనని కలెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నిక‌ల క‌మిష‌న్ సూచ‌న మేర‌కు వివేక్ యాద‌వ్ ను నియ‌మించిన‌ట్లు జీవోలో పేర్కొంది. అలాగే పలువురు ఐఏఎస్ అధికారులను సర్కార్ బదిలీ చేసింది.

ఎక్సైజ్ శాఖ క‌మిష‌నర్ గా ర‌జ‌త్ భార్గ‌వ్ కు పూర్తి అద‌న‌పు బాధ్య‌త‌లు అప్పగించగా.. టూరిజం, యువ‌జ‌నుల శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగాను అదనపు బాధ్యతలు కట్టబెట్టింది.

Also Read:గుంటూరు, చిత్తూరుకు కొత్త కలెక్టర్లు: సీఎస్‌కు నిమ్మగడ్డ ఆదేశాలు

అలాగే ప‌ట్ట‌ణాభివృద్ది శాఖ క‌మిష‌న‌ర్ గా వై.శ్రీల‌క్ష్మి కి పూర్తి అద‌న‌పు బాధ్య‌త‌లు అప్పగించింది. పొల్యూష‌న్ కంట్రోల్ బోర్డు మెంబ‌ర్ సెక్ర‌ట‌రీగా విజ‌య్ కుమార్‌కు సైతం పూర్తి అదనపు బాధ్యతలు కట్టబెట్టింది.

కాగా, గుంటూరు, చిత్తూరు కలెక్టర్లను మార్చాలని గతేడాది మార్చిలోనే ప్రభుత్వానికి సూచించారు ఎస్ఈసీ నిమ్మగడ్డ. ఎన్నికల ప్రక్రియలో భాగంగా కలెక్టర్లతో జరిపిన సంప్రదింపుల్లోనూ గుంటూరు, చిత్తూరు కలెక్టర్లను దూరంగానే పెట్టారు .

ఆయా జిల్లాల జేసీ-1లతో ఎన్నికల ప్రక్రియల సంప్రదింపులు జరిపారు. ఇద్దరు కలెక్టర్లతోపాటు.. కొందరు పోలీసు అధికారులను ఎన్నికల విధులకు దూరంగా పెట్టాలన్న సూచనను ఎట్టకేలకు ప్రభుత్వం అమలు చేసింది.

click me!