అప్పుడు మోడీ గోబ్యాక్, ఇప్పుడు కమ్ బ్యాక్: చంద్రబాబుపై విష్ణువర్ధన్ రెడ్డి ఫైర్

By telugu teamFirst Published Aug 8, 2020, 2:25 PM IST
Highlights

ఏపీ రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని అంటున్న టీడీపీ అధినేత చంద్రబాబుపై బిజెపి నేత విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. అప్పుడు మోడీ గోబ్యాక్ అన్నారని, ఇప్పుడు కమ్ బ్యాక్ అంటున్నారని ఆయన అన్నారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని వివాదంపై తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత నారా చంద్రబాబు నాయుడిపై బిజెపి నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. గతంలో మోడీని చంద్రబాబు గో బ్యాక్ అన్నారని, ఇప్పుడు కమ్ బ్యాక్ అంటున్నారని ఆయన అన్నారు. బీజేపీకి సంబంధం లేకపోయినా బీజేపీని ముద్దాయి చేయాలని కొన్ని పార్టీలు చూస్తున్నాయని ఆయన అన్నారు.

సీబీఐ రాష్ట్రంలో అడుగుపెట్టానికి చంద్రబాబు వీల్లేదన్నారని, ఇపుడు రాజధాని విషయంలో కేంద్రం జోక్యం  చేసుకోవాలని ఎలా అడుగుతున్నారని ఆయన అన్నారు. మెగాస్టార్ చిరంజీవి బీజేపీలోకి వస్తామంటే స్వాగతిస్తామని చెప్పారు.ప్రభుత్వం వేరు భారతీయ జనతా పార్టీ వేరు అని, చంద్రబాబు అమరావతిని రాజధానిగా ఎంపిక చేస్తే కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ఆయన గుర్తు చేశారు. కేంద్రం లో కాంగ్రెస్ లో ఉన్నా,బీజేపీ ఉన్నా అప్పుడు అమరావతి ని  రాజధానిగా ఆమోదించే  వాళ్లేనని ఆయన అన్నారు. 

టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్, కేశినేని పార్లమెంట్ లో అడిగిన ప్రశ్నకు సమాధానంగా రాజధాని రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుందని కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పిందని ఆయన చెప్పారు. పెడరల్ స్ఫూర్తిని  గౌరవించి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు అమరావతిలో హై కోర్టు పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకొందని అన్నారు. రైతుల పక్షాన బీజేపీ నిలబడతుందని, రాజ్యాంగం అందరికి సమానంగా ఉంటుందని ఆయన అన్నారు. 

టీడీపీ, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంసలు పార్టీలు మాత్రమే వేరని, స్కీఫ్ట్ మాత్రం టీడీపీదేనని, చంద్రబాబు ఉదయం మాట్లాడిందే సాయింత్రం కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీల నాయకులు మాట్లాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. 

click me!