అల్లుడి వేధింపులు.. తండ్రి ఆత్మహత్య.. తట్టుకోలేక ఇద్దరు కూతుళ్లు..

Published : Aug 08, 2020, 01:15 PM IST
అల్లుడి వేధింపులు.. తండ్రి ఆత్మహత్య.. తట్టుకోలేక ఇద్దరు కూతుళ్లు..

సారాంశం

కాగా.. గత కొంతకాలంగా వారి ఇంట్లో సమస్యలు తలెత్తుతున్నాయి. తన పెద్ద కుమార్తెను అల్లుడు వేధించడాన్ని బాబు రెడ్డి తట్టుకోలేక పోయాడు. దీంతో.. సెల్ఫీవీడియో తీసుకుంటూ ఆత్మహత్య చేసుకున్నాడు.  

కుటుంబ సమస్యలను తట్టుకోలేక ఓ వ్యక్తి  బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే.. తండ్రి లేని ఈ జీవితం మాకు అవసరం లేదంటూ.. ఆయన ఇద్దరు కూతుళ్లు కూడా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన కడప జిల్లాలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కడప జిల్లా ప్రొద్దుటూరు లోని వైఎంఆర్ కాలనీకి చెందిన బాబురెడ్డికి భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాగా.. గత కొంతకాలంగా వారి ఇంట్లో సమస్యలు తలెత్తుతున్నాయి. తన పెద్ద కుమార్తెను అల్లుడు వేధించడాన్ని బాబు రెడ్డి తట్టుకోలేక పోయాడు. దీంతో.. సెల్ఫీవీడియో తీసుకుంటూ ఆత్మహత్య చేసుకున్నాడు.

కాగా.. తండ్రి మరణవార్తను భరించలేని అతని ఇద్దరు కూతుళ్లు శ్వేత, ఇంజనీరింగ్‌ చదువుతున్న సాయి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. ఎర్రగుంట్ల మండలం తిప్పలూరు - రాణిపేట మధ్యగల రైల్వే ట్రాక్ పైన ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు