AP Assembly...జగన్‌ను పొగిడిన మరో టీడీపీ ఎమ్మెల్యే: ప్రతిపక్షంలో కలకలం

By sivanagaprasad KodatiFirst Published Dec 9, 2019, 5:49 PM IST
Highlights

వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మరో టీడీపీ నేత ప్రశంసల జల్లు కురిపించారు. ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో భాగంగా విశాఖ పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే గణబాబు మీడియాతో మాట్లాడారు. 

వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మరో టీడీపీ నేత ప్రశంసల జల్లు కురిపించారు. ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో భాగంగా విశాఖ పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే గణబాబు మీడియాతో మాట్లాడారు.

ఇంటెలిజెన్స్ ద్వారా కాకుండా సొంత మార్గాల్లో సీఎం సమాచారాన్ని తెప్పించుకుంటున్నారని ఆయన గుర్తుచేశారు. క్షేత్రస్థాయిలో ఇంటెలిజెన్స్ చెప్పని సమాచారాన్ని కూడా జగన్ తెప్పించుకుంటున్నారని.. నాయకుడు అనే వాడికి అలాంటి సమాచారమే అవసరమని గణబాబు పేర్కొన్నారు. 

Also Read:అసెంబ్లీలో ఉల్లిపై జగన్ : రైతుబజార్ లో కిలో రూ.25 కానీ చంద్రబాబు హెరిటేజ్ లో కిలో ఉల్లి రూ.200

మరోవైపు తొలి రోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ఉల్లిఘాటు రగడ సృష్టించింది. ఉల్లి ధరలపై వాయిదా తీర్మానాన్ని అమోదించాలంటూ స్పీకర్ తమ్మినేని సీతారాంపైను డిమాండ్ చేశారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు. 

ఉల్లిధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో అసెంబ్లీలో చర్చకు అవకాశం ఇవ్వాలంటూ టీడీపీ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. అయితే అందుకు స్పీకర్ తమ్మినేని సీతారాం ససేమిరా అన్నారు. మహిళల భద్రతకు సంబంధించి కీలక బిల్లుపై చర్చ జరుగుతుందని అందుకు సహకరించాలని కోరారు. 

ఇంతలో మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు షాక్ ఇచ్చారు.స్పీకర్ తమ్మినేని సీతారాంకు ఉల్లిపాయల గిఫ్ట్ ప్యాక్ ఇచ్చిన ఇచ్చారు. ఉల్లిధరల నియంత్రణకు సంబంధించి అసెంబ్లీలో చర్చించేందుకు అవకాశం కల్పించాలని సూచించారు. 

ఉల్లిధరలపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు చేస్తున్న రాద్ధాంతంపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉల్లి అందుబాటులో లేకపోవడంతో రాజస్థాన్ వంటి రాష్ట్రాల నుంచి కూడా ఉల్లిని కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. 

Also Read:AP Assembly : ఏపీ అసెంబ్లీలో "కేసీఆర్" రచ్చ

ఉల్లికొనుగోలుకు సంబంధించి వైసీపీ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం రైతుబజార్ లోకిలో ఉల్లిపాయలను రూ.25కు అందిస్తుంటే చంద్రబాబు నాయుడుకు చెందిన హెరిటేజ్ లో మాత్రం కిలో రూ.200కు అమ్ముతున్నారంటూ విరుచుకుపడ్డారు. చంద్రబాబు నాయుడు తన హెరిటేజ్ లో రూ.25కు అమ్మగలరా అంటూ నిలదీశారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.  

click me!