ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ కు అనుమతి: రిషికొండకు బయల్ధేరిన జనసేనాని

By narsimha lode  |  First Published Aug 11, 2023, 4:43 PM IST

రిషికొండకు వెళ్లేందుకు  జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కు పోలీసులు అనుమతిని ఇచ్చారు. 


విశాఖపట్టణం: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్  రుషికొండ పర్యటనకు పోలీసులు అనుమతిని ఇచ్చారు. వారాహి విజయయాత్రలో  భాగంగా  పవన్ కళ్యాణ్  విశాఖపట్టణంలో  పర్యటిస్తున్నారు.  శుక్రవారంనాడు  రిషికొండ, ఎర్రమట్టి దిబ్బలను పరిశీలిస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అయితే  రిషికొండకు వెళ్లేందుకు  పవన్ కళ్యాణ్  పోలీసులు షరతులతో  కూడిన అనుమతిని ఇచ్చారు.  తాము చేసిన సూచనలను పాటించాలని  విశాఖపట్టణం పోలీసులు  సూచించారు. రిషికొండకు సమీపంలో రోడ్డుపై   పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. వారాహి వాహనంతో పాటు  ఏడు వాహనాలకు మాత్రమే పోలీసులు అనుమతిని ఇచ్చారు.  నిబంధనలను  ఉల్లంఘించవద్దని కూడ  పోలీసులు జనసేన నేతకు సూచించారు.

రిషికొండకు వెళ్లేందుకు  అనుమతి కోసం  పోలీసులు, జనసేన నేతలు పలు దఫాలు చర్చించారు.ఈ చర్చల మీదట పవన్ కళ్యాణ్ రిషికొండ వెళ్లేందుకు  అనుమతి లభించింది. రిషికొండలో  ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘిస్తుందని  జనసేన ఆరోపణలు చేస్తుంది. రిషికొండలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లాలని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. గత ఏడాది నవంబర్  మాసంలో కూడ పవన్ కళ్యాణ్ రిషికొండకు వెళ్లారు.

Latest Videos

also read:నేడు రిషికొండకు పవన్: పోలీసులు అనుమతించేనా?

వారాహి విజయయాత్ర (వారాహి మూడో విడత) నిన్న విశాఖపట్టణంలో ప్రారంభమైంది.  ఈ నెల  19 వ తేదీ వరకు  ఈ యాత్ర కొనసాగుతుంది. పవన్ కళ్యాణ్  విశాఖపట్టణం సమస్యలపై  ఫోకస్ చేయనున్నారు.   నిన్న జగదాంబ సెంటర్ లో నిర్వహించిన సభలో ఏపీ సీఎం వైఎస్ జగన్ పై  పవన్ కళ్యాణ్  తీవ్ర విమర్శలు చేశారు. సెక్షన్ 30 అమల్లో ఉన్న నేపథ్యంలో  నిన్న  పవన్ కళ్యాణ్  విశాఖ సభలో చేసిన వ్యాఖ్యలపై  పోలీసులు  జనసేనకు నోటీసులు జారీ చేశారు.  విద్వేష పూరితమైన వ్యాఖ్యలు చేయవద్దని సూచించారు.  నిన్నటి సభలో చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని జనసేనను పోలీసులు కోరారు.  అంతే శాంతికి విఘాతం కల్గించబోమని హామీ ఇవ్వాలని కూడ జనసేనను పోలీసులు  కోరారు.
 


 

click me!