షర్మిల కాంగ్రెస్‌తో కలిస్తే.. ఆ పార్టీకి తిప్పలే..: వైసీపీ రెబల్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

By Rajesh KarampooriFirst Published Aug 11, 2023, 4:36 PM IST
Highlights

MP Raghurama: వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తే వైసీపీకి ఏపీలో తిప్పలు తప్పవని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. 

MP Raghurama: తెలంగాణలో రాజన్న రాజ్యం స్థాపనే లక్ష్యంతో వైఎస్ షర్మిల వైఎస్సాఆర్‌టీపీ అనే పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. తానూ తెలంగాణ బిడ్డేనని, వైఎస్ సంక్షేమ పాలనను తెలంగాణలో తిరిగి తీసుకురావటమే తన లక్ష్యమంటూ..వైఎస్సాఆర్‌ సెంటిమెంట్‌ను క్యాచ్ చేయాలని ప్రయత్నం చేసింది. చేవెళ్లలో పాదయాత్రను ప్రారంభించిన షర్మిల రాష్ట్రవ్యాప్తంగా 3800 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. ఈ క్రమంలో కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పార్టీ బలోపేతం చేయాలని ప్రయత్నించారు.  

అయితే కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధించడంతో తెలంగాణలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కాంగ్రెస్ పార్టీ తిరిగి ఫామ్ లోకి వచ్చింది. ఫైనల్ గా బీఆర్ఎస్ కు గట్టి పోటీ నిచ్చే సత్తా తమకే ఉందని తెలంగాణ కాంగ్రెస్ పేర్కొంది.  ఈ నేపథ్యంలో షర్మిల కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ గత కొంత కాలంగా ప్రచారం జరగుతోంది. ఈ తరుణంలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్‌తో షర్మిల పలుమార్లు ఆమె భేటీ కావడం ఈ వార్తలకు ఊతమిస్తోంది.  

వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారనే వార్తలపై పలువురు నేతలు పలువిధాలు కామెంట్ చేస్తున్నారు. ఈ తాజా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్సాఆర్‌టీపీ .. కాంగ్రెస్ లో విలీనమైతే.. ఏపీ(AP)లో సీఎం జగన్ కు తిప్పలు తప్పవని వైసీపీ రెబల్ ఎంపీ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒక వేళ షర్మిల కాంగ్రెస్‌లోకి వెళ్తే తన తండ్రి(వైఎస్సార్) రుణం తీర్చుకున్నట్లు ఉంటుందని అన్నారు. వైఎస్సార్ కు, సీఎం జగన్‌ కు చాలా తేదా ఉండనీ, వైఖరీని చూసి రాజశేఖర్‌రెడ్డి పైన నించి దిగి వస్తే ఖచ్చితంగా ఓటు వేయరని అన్నారు. 

విశాఖపట్నంలో వారాహి 3 యాత్ర కోసం ప్రజలందరూ ఎదురు చూస్తున్నారనే  సీఎం జగన్ రుషికొండ‌(Rushikonda)కు పవన్ కళ్యాన్‌ను వెళ్లనివ్వరనీ, పవన్ కళ్యాణ్ చిరునవ్వులతో వైసీపీ ప్రభుత్వం విమర్శలు గుప్పిస్తారని అన్నారు.  లిక్కర్ 35 వేల కోట్లు కొట్టేస్తున్నరని వైసీపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్‌ను ఎంపీ రఘురామ కృష్ణరాజు  సమర్థిస్తాను. రుషికొండ‌లో జగన్ ఇల్లు కట్టుకుంటారనీ, అక్కడకి పవన్ కళ్యాణ్ వెళ్తే.. ఆ ఇల్లు బాగోతం బయటపడుతోందని ఆరోపించారు. 

చారిత్రాత్మక బిల్లు

కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్‌సభలో చారిత్రాత్మక బిల్లులను ప్రవేశ పెట్టారని ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు.ఐపీసీ ,సీఆర్పీసీ,ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో కొత్త చట్టాలను తీసుకరాబోతున్నారనీ, రాజద్రోహం కేసులు పెట్టడానికి వీలు లేకుండా కొత్త బిల్లులు స్టాండింగ్ కమిటీకి వెళ్లాయని తెలిపారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదం పొందుతాయనీ, ఇలాంటి దరిద్రపు బిల్లులు ఏపీలో లేకుండా కేంద్రం చట్టం తీసుకొస్తుందని ఆయన తెలిపారు. ఉత్తరాంధ్రలో తెలుగుదేశం అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.  

click me!