విశాఖ సాయిప్రియ కేసులో మరో ట్విస్ట్:తండ్రి అప్పలరాజుపై కేసు

Published : Aug 30, 2022, 10:40 AM ISTUpdated : Aug 30, 2022, 10:43 AM IST
విశాఖ సాయిప్రియ కేసులో మరో ట్విస్ట్:తండ్రి అప్పలరాజుపై కేసు

సారాంశం

విశాఖపట్టణంలో బీచ్ నుండి ప్రియుడితో వెళ్లిపోయిన సాయిప్రియ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. కూతురు ప్రేమ వ్యవహరం తెలిసి కూడా పోలీసులను ఉద్దేశ్యపూర్వకంగా తప్పుదోవ పట్టించారని కేసు పెట్టారు.

విశాఖపట్టణం: విశాఖ పట్టణంలో సాయిప్రియ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. కూతురి ప్రేమ వ్యవహరం తెలిసి  దాచిపెట్టిన తండ్రి  అప్పలరాజుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే  సాయిప్రియతో పాటు ఆమె ప్రియుడిపై కూడా పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

విశాఖపట్టణం బీచ్  నుండి సాయి ప్రియ తన ప్రియుడితో పారిపోయిన తర్వాత ఆమె కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. బీచ్ లో కొట్టుకుపోయిందనే అనుమానంతో హెలికాప్టర్ ను రంగంలోకి దించి గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ప్రియుడితో సాయిప్రియ జంప్ అయిన విషయాన్ని పోలీసులు ఆ తర్వాత గుర్తించారు. నెల్లూరులో ఉన్న సాయిప్రియను పోలీసులు తీసుకు వచ్చారు. అయితే  కూతురి ప్రేమ విషయం తెలిసి కూడా చెప్పకుండా పోలీసులను తప్పుదారి పట్టించారని  సాయిప్రియ తండ్రి అప్పలరాజుపై పోలీసులు కేసు నమోదు చేశారు.

విశాఖపట్టణంలోని సంజీవయ్యనగర్ కు చెందిన సాయిప్రియకు శ్రీకాకుళం జిల్లాకు చెందిన శ్రీనివాసరావుతో  రెండేళ్ల క్రితం వివాహమైంది. శ్రీనివాసరావు హైద్రాబాద్ లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. సాయిప్రియ మాత్రం తన చదువు కోసం సంజీవయ్య నగర్ లో ఉంటుంది. 

ఈ ఏడాది జూలై 25న సాయిప్రియ, శ్రీనివాసరావుల  పెళ్లి రోజు.పెళ్లి రోజు కావడంతో బీచ్ లో సరదాగా గడపాలని వెళ్లారు. అయితే భర్త ఫోన్ చూస్తున్న సమయంలోనే సాయిప్రియ భర్త కళ్లుగప్పి ప్రియుడితో పారిపోయింది. అయితే బీచ్ లో సాయిప్రియ తప్పిపోయిందనే అనుమానంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.  సాయిప్రియ కోసం సుమారు కోటి రూపాయాలను ఖర్చు చేశారు. అయితే తాను క్షేమంగా ఉన్నట్టుగా సాయిప్రియ తన పేరేంట్స్ కు సమాచారం ఇచ్చింది. ఈ సమాచారం ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తే ఆమె ప్రేమ వ్యవహారం వెలుగు చూసింది.  సాయిప్రియ వ్యవహరంపై కోర్టు అనుమతితో పోలీసులు కేసు నమోదు చేశారు. సాయిప్రియతో పాటు ఆమె ప్రియుడు రవిపై పోలీసులు కేసు పెట్టారు. 

సాయిప్రియకు రవితో ప్రేమ వ్యవహరం ఉన్న విషయం ఆమె తండ్రి అప్పలరాజుకు తెలుసునని పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు. సాయిప్రియ కోసం గాలింపు చర్యలు జరిపే సమయంలో పోలీసులకు ఈ సమాచారం ఇవ్వకుండా దాచిపెట్టారని అప్పలరాజుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఉద్దేశ్యపూర్వకంగానే అప్పలరాజు ఈ పని చేశారని పోలీసులు ఆయనపై కేసు పెట్టారు. 

ప్రియుడు రవితో కలిసి ఆమె ఇటీవల విశాాఖ పోలీస్ స్టేషేన్ కు వచ్చింది. భర్త శ్రీనివాసరావుతో ఇంటికి వెళ్లాలని  పెద్దలు కోరారు. అయితే శ్రీనివాసరావుతో పెళ్లి తనకు  ఇష్టం లేదని సాయిప్రియ తెలిపింది. దీంతో  ప్రియుడు రవితో ఉంటానని చెప్పింది..  ప్రియుడితో సాయిప్రియ వెళ్లేందుకు పోలీసులు అనుమతించారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Fire Service వారోత్సవాల్లో DGP Harish Kumar Gupta | Fire Service Vehicles | Asianet News Telugu
Perni Nani press meet: మోయ‌లేని గుదిబండగా అమ‌రావ‌తి చంద్రబాబుపై పేర్నినాని సెటైర్లు | Asianet Telugu