విశాఖపట్నం నార్త్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 Live

Published : Jun 04, 2024, 10:49 AM ISTUpdated : Jun 06, 2024, 05:13 PM IST
విశాఖపట్నం నార్త్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 Live

సారాంశం

మూడు రాజధానుల ప్రకటన తర్వాత విశాఖపట్నం రాజకీయాలకు కేంద్రబిందువుగా మారిపోయింది. ఇక్కడ అధికార, ప్రతిపక్షాల మధ్య రసవత్తర రాజకీయాలు సాగుతున్నాయి. విశాఖకకు రాజధానిని తరలిస్తామని వైసిపి, అమరావతిలోనే రాజధానిని కొనసాగిస్తామని టిడిపి స్పష్టం చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో   ఎన్నికలు జరగడంతో ఓటర్ల తీర్పుపై మొదటి నుంచి ఆసక్తి  ఉంది. 

విశాఖ నార్త్ నియోజకవర్గ రాజకీయాలు :

విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గంలో టిడిపితో పాటు బిజెపి కూడా బలంగానే వుంది. ప్రత్యేక ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 2014లో మొదటి ఎన్నికలు జరగ్గా బిజెపి విజయం సాధించింది. ఇప్పటిలాగే ఆ ఎన్నికల్లో కూడా టిడిపి, బిజెపిల మధ్య పొత్తు వుంది... దీంతో బిజెపి సీనియర్ నాయకులు పెన్మెత్స విష్ణుకుమార్ రాజు పోటీచేసి గెలిచారు. 

ఇక 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి ఒంటరిగా పోటీచేసింది. దీంతో విశాఖ ఉత్తర నియోజకవర్గంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పోటీచేసి విజయం సాధించారు. బిజెపి నుండి పోటీచేసిన విష్ణుకుమార్ రాజు నాలుగో స్థానానికి పరిమితం అయ్యారు. 

ఇదిలావుంటే ఈ విశాఖ ఉత్తర నియోజకవర్గంలో వైసిపి ఇప్పటివరకు గెలిచింది లేదు. కాబట్టి ఈసారి ఎలాగైనా గెలిచి విశాఖలో సత్తా చాటాలని చూస్తోంది.  అందుకోసమే మరోసారి   కమ్ముల కన్నపరాజును వైసిసి అదిష్టానం బరిలోకి దింపుతోంది. 

విశాఖ ఉత్తర నియోజకవర్గ పరిధి :

1. విశాఖపట్నంలోని 36 నుండి 41 వరకు, 41,44, 45 మరియు 49 నుండి 52 వరకు గల వార్డులు ఈ నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి. 

విశాఖ ఉత్తర అసెంబ్లీ ఓటర్లు : 

నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య (2019 ఎన్నికల ప్రకారం) -  2,80,328
పురుషులు -    1,,39,952
మహిళలు ‌-    1,40,359

విశాఖపట్నం నార్త్ అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు : 

వైసిపి అభ్యర్థి :

ఇప్పటివరకు విశాఖ నార్త్ నియోజకవర్గంలో వైసిపి  గలిచింది లేదు...  కానీ 2019 ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థినే వైసిపి రిపీట్ చేస్తోంది.  మరోసారి కమ్ముల కన్నపరాజు విశాఖ నార్త్ లో పోటీ చేస్తున్నారు. 

బిజెపి అభ్యర్థి : 

టిడిపి, జనసేన, బిజెపి కూటమి అభ్యర్థిగా విశాఖ నార్త్ లో మాజీ ఎమ్మెల్యే పెన్మెత్స విష్ణుకుమార్ రాజు పోటీ చేస్తున్నారు. పొత్తులో భాగంగా ఈ సీటును బిజెపికి కేటాయించడంతో విష్ణుకుమార్ రాజు పోటీ చేస్తున్నారు. బిజెపి అధికారికంగా ప్రకటించకున్నా ఆయన పోటీ ఖాయమైనట్లు సమాచారం. 

విశాఖ నార్త్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు :

విశాఖపట్నం నార్త్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

విశాఖపట్నం నార్త్ నియోజకవర్గంలో బీజేపీ పార్టీ గెలుపొందింది. వైఎస్సార్‌సీపీ చెందిన కన్నపరాజు కమ్మిల (KK రాజు)పై బీజేపీకి విష్ణు కుమార్ రాజు విజయం సాధించారు.

విశాఖ ఉత్తర అసెంబ్లీ ఎన్నికలు 2019 ఫలితాలు : 

నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,76,065 ఓట్లు (63 శాతం)

టిడిపి - గంటా శ్రీనివాసరావు - 67,352 ఓట్లు (38 శాతం) - 1944 ఓట్ల మెజారిటీతో విజయం 

వైసిపి - కమ్ముల కన్నపరాజు - 65,408 ఓట్లు (36 శాతం) - ఓటమి

జనసేన పార్టీ ‌- పసుపులేటి ఉషాకిరణ్ - 19,139 (10 శాతం)

బిజెపి - విష్ణుకుమార్ రాజు - 18,790 (10 శాతం)

విశాఖ నార్త్ అసెంబ్లీ ఎన్నికలు 2014 ఫలితాలు :

బిజెపి- విష్ణుకుమార్ రాజు - 82,079 (51 శాతం) - 18,240 ఓట్ల మెజారిటీతో విజయం 

వైసిపి - చొక్కాకుల వెంకటరావు - 63,839 (39 శాతం) - ఓటమి

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్