కళ్యాణదుర్గం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 Live

By tirumala AN  |  First Published Jun 4, 2024, 10:46 AM IST

2024 ఎన్నికల విషయానికి వస్తే.. కళ్యాణదుర్గంలో మరోసారి గెలిచి పట్టు నిరూపించుకోవాలని సీఎం వైఎస్ జగన్ భావిస్తున్నారు. దీనిలో భాగంగా సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి ఉషశ్రీ చరణ్‌కు బదులు తలారి రంగయ్యను జగన్ బరిలో దించారు.


ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం నియోజకవర్గానికి చారిత్రకంగా ఘన చరిత్ర వుంది. శతాబ్ధాల నాటి రాచరిక ఆనవాళ్లు ఇంకా ఆ ప్రాంతంలో వున్నాయి. 1652లో ఇక్కడి కుసుమగిరిని కేంద్రంగా చేసుకుని ఈ ప్రాంతాన్ని పాలెగాళ్లు పాలించినట్లుగా తెలుస్తోంది. కాలక్రమంలో అది కుందుర్పి కొండగా మారింది. సముద్రమట్టానికి 3 వేల అడుగుల ఎత్తులో కొండపై ఈ కోటను నిర్మించారు.

ఈ కొండపై వున్న కొలనులు ఎంతటి మండు వేసవిలోనైనా ఇంకిపోకుండా వుంటాయి. ఇక రాజకీయాలు కూడా కళ్యాణదుర్గంలో హాట్ హాట్‌గానే సాగుతాయి. తొలి నుంచి ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. టీడీపీ ఆవిర్భావం నుంచి నేటి వరకు ఆ పార్టీ 5 సార్లు గెలిచింది. తొలుత ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గంగా వున్న కళ్యాణదుర్గం .. 20009లో నియోజకవర్గాల పునర్విభజన అనంతరం జనరల్ కేటగిరీ కిందకు మారింది. 

Latest Videos

కళ్యాణదుర్గం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 .. టీడీపీ కంచుకోట :

కళ్యాణదుర్గం సెగ్మెంట్‌లో మొత్తం ఓటర్ల సంఖ్య 2,19,591 మంది. బ్రహ్మసముద్రం, కళ్యాణదుర్గం, సెట్టూర్, కుందుర్పి, కంబ్దూర్ మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలో వున్నాయి. కురబ, బోయ , బీసీ , దళిత ఓటర్లు ఇక్కడ పెద్ద సంఖ్యలో వున్నారు. మాజీ మంత్రి, మాజీ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహించి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గాల్లో స్థానం సంపాదించుకున్నారు.

1952లో నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి కళ్యాణదుర్గంలో కాంగ్రెస్ పార్టీ 4 సార్లు, టీడీపీ 5 సార్లు, ఇతరులు మూడుసార్లు, వైసీపీ ఒకసారి విజయం సాధించాయి. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి ఉషశ్రీ చరణ్‌కు 88,051 ఓట్లు.. టీడీపీ అభ్యర్ధి ఉమామహేశ్వర నాయుడుకు 68,155 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా వైసీపీ 19,896 ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది.

కళ్యాణదుర్గం శాసనసభ ఎన్నికల ఫలితాలు 2024 .. రఘువీరారెడ్డి రీఎంట్రీ :

2024 ఎన్నికల విషయానికి వస్తే.. కళ్యాణదుర్గంలో మరోసారి గెలిచి పట్టు నిరూపించుకోవాలని సీఎం వైఎస్ జగన్ భావిస్తున్నారు. దీనిలో భాగంగా సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి ఉషశ్రీ చరణ్‌కు బదులు తలారి రంగయ్యను జగన్ బరిలో దించారు. టీడీపీ విషయానికి వస్తే.. కళ్యాణదుర్గం టికెట్ కోసం ఆశావహుల లిస్ట్ భారీగా వుంది. సీనియర్ నేతలు హనుమంతరాయ చౌదరి, ఉమామహేశ్వరనాయుడు టికెట్‌ కోసం తీవ్రంగా ప్రయత్నించారు.

అయితే చంద్రబాబు అమిలినేని సురేంద్ర బాబును అభ్యర్ధిగా ప్రకటించారు. వైసిపి నుంచి తలారి రంగయ్య పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి రాంభూపాల్ రెడ్డి పోటీచేస్తున్నారు. ఆయన ప్రభావం కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. మరి కల్యాణ దుర్గం ఫలితం ఎలా ఉండబోతోందో చూడాలి. 

click me!