విశాఖలో మోడీ టూర్: స్టీల్ ప్లాంట్ కార్మికులను శిబిరం నుండి పంపిన పోలీసులు

By narsimha lodeFirst Published Nov 11, 2022, 4:01 PM IST
Highlights


విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల దీక్ష శిబిరాన్నిపోలీసులు ఖాళీ చేయించారు. ఇవాళ రాత్రికి ప్రధాని ఇదే మార్గంలో రోడ్ షో నిర్వహించే అవకాశం ఉన్నందున పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. 
 

విశాఖపట్టణం:ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులను దీక్షా శిబిరం నుండి ఖాళీ చేయించారు  పోలీసులు . విశాఖ స్టీల్ ప్లాంట్ పై స్పష్టమైన ప్రకటన చేయాలని ప్రధానిని విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు కోరుతున్నారు. నల్లబ్యాడ్జీలతో కార్మికులు నిరసనకు దిగారు.కుటుంబ సభ్యులతో ఇవాళ నిరసన కొనసాగిస్తున్నారు. ప్రధాని మోడీ ఇదే శిబిరం ముందుగా రోడ్ షో చేసేలా బీజేపీ నేతలు ప్లాన్ చేశారు. దీంతో పోలీసులు దీక్షా శిబిరం వద్ద ఉన్న నిరసనకారులను పోలీసులు ఖాళీ చేయించారు.  

విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరిస్తామని కేంద్రం గతంలోనే ప్రకటించింది.విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించవద్దని పలు రాజకీయ పార్టీలు ,కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించవద్దనే డిమాండ్ తో కార్మిక సంఘాల జేఏపీ ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నిరసనలుఇవాళ్టికి 638కి చేరుకున్నాయి.  ప్రధానిని కలిసే అవకాశం కల్పిస్తే  ప్లాంట్ ను ఎలా లాభాల్లోకి తీసుకువచ్చే విషయాలపై చర్చించనున్నట్టుగా కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కొరకు అనేకమంది ప్రాణ త్యాగం చేశారని గుర్తుచేశారు.

also read:ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా: కుటుంబ సభ్యులతో విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల నిరసన

అంతేకాదు పలువురు ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామాలు చేసిన విషయాన్నికూడా కార్మిక సంఘాల నేతలు గుర్తు చేస్తున్నారు.  నాలుగైదు రోజులుగా కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో తమ నిరసనలను  కార్మిక సంఘాలు ఉధృతం చేశాయి. ప్రధాని పర్యటన నేపథ్యంలో అవసరమైతే కార్మిక సంఘాల జేఏసీ నేతలను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉందనే ప్రచారం కూడ సాగుతుంది.విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రజాభిప్రాయం ఎలా ఉందో తమకు తెలుసునని  సోము వీర్రాజు చెబుతున్నారు.ఈ విషయాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్తామన్నారు.

click me!