ఏజెన్సీలో మతమార్పిడులు.. అంతా ఓ మతం కనుసన్నల్లోనే : స్వరూపానందేంద్ర కీలక వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Dec 25, 2022, 03:55 PM ISTUpdated : Dec 25, 2022, 03:56 PM IST
ఏజెన్సీలో మతమార్పిడులు.. అంతా ఓ మతం కనుసన్నల్లోనే : స్వరూపానందేంద్ర కీలక వ్యాఖ్యలు

సారాంశం

మత మార్పిడులకు సంబంధించి విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏజెన్సీలో మత మార్పిడిని ఓ మతం ప్రోత్సహిస్తోందని .. ఇక్కడి వనరుల దోపిడీని అడ్డుకోవాలని ఆయన సూచించారు. 

విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఏజెన్సీలో మత మార్పిడిని ఓ మతం ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. వనరుల దోపిడీని ఎదుర్కొనేందుకు గిరిజనులు సిద్ధంగా వుండాలి ఆయన పిలుపునిచ్చారు. గత ప్రభుత్వ బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకించింది శారదా పీఠమేనని స్వరూపానందేంద్ర గుర్తుచేశారు. 

ఇదిలావుండగా... వచ్చే నెల 27 నుంచి శారదా పీఠం వార్షిక మహోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్సవాలకు హాజరుకావాల్సిందిగా ఆశ్రమ వర్గాలు సీఎం జగన్‌ను ఆహ్వానించాయి. ఈ మేరకు శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి ఈ నెల 15న తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జగన్‌ను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. అనంతరం ఆయనకు స్వాత్మానందేంద్ర వేదాశీర్వచనం అందించారు. 


 

PREV
click me!

Recommended Stories

సచివాలయం ఉద్యోగులు VS పోలీస్ లు విజయవాడ ధర్నా చౌక్ వద్ద హై టెన్షన్ | Secretariat Employees Dharna
Weather Update: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. రాబోయే 3 రోజులు దంచికొట్టనున్న వానలు